తెలంగాణ

telangana

ETV Bharat / sports

మహిళా కామెంటేటర్ డబుల్ మీనింగ్ డైలాగ్.. అందరూ షాక్!

Isa Guha Commentary: ప్రస్తుతం జరుగుతున్న బిగ్​బాష్​ లీగ్​లో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. ఓ మహిళా కామెంటేటర్​ చేసిన డబుల్ మీనింగ్ కామెంట్​కు అందరూ ఒక్కసారిగా షాకయ్యారు.

Isa Guha
Isa Guha

By

Published : Dec 15, 2021, 11:46 AM IST

Isa Guha Commentary: ఆస్ట్రేలియా ఫేమస్​ టీ20 లీగ్​​ బిగ్​బాష్ మ్యాచ్​లు జోరుగా సాగుతున్నాయి. ఈ క్రమంలోనే బుధవారం పెర్త్ స్క్రాచర్స్​-హోబర్ట్ హరికేన్స్ మధ్య మ్యాచ్ జరిగింది. కామెంటరీ బాక్స్​లో ఆసీస్ మాజీ క్రికెటర్ ఆడమ్ గిల్​క్రిస్ట్​తో పాటు ఇంగ్లాండ్ మాజీ మహిళా క్రికెటర్ ఇసా గుహ కామెంటేటర్స్​గా బాధ్యతలు నిర్వర్తించారు. ఈ క్రమంలోనే క్యారమ్ బాల్​ గురించి వివరించే క్రమంలో ఇసా చేసిన ఓ డబుల్ మీనింగ్​ కామెంట్ అందరినీ షాక్​కు గురిచేసింది. అలాగే నవ్వుల్లో ముచ్చెత్తింది.

ఏం జరిగింది?

గిల్​క్రిస్ట్​, ఇసా గుహతో పాటు ఉన్న మరో కామెంటేటర్​ క్యారమ్ బాల్ గురించి వివరించారు. కోచ్​లు అలాంటి బంతుల్ని విసిరే వారిని ఎలా గుర్తిస్తారనే విషయం చెప్పారు. మిడిల్ ఫింగర్ (మధ్య వేలు) ఎవరికైతే ఎక్కువ పొడుగ్గా ఉంటుదో వారు క్యారమ్ బాల్ వేయడంలో గొప్పగా రాణిస్తారని.. అందుకే కోచ్​లు అలాంటి వారికి ఆ బంతి మెళకువలు నేర్పుతారని చెప్పారు. ఈ క్రమంలోనే ఈ విషయంపై స్పందిస్తూ 'మీదెంత పెద్దగా ఉంది' (మధ్య వేలు) అని ఇసా అనగా.. గిల్లీతో పాటు ఉన్న మరో కామెంటేటర్​ ఒక్కసారిగా షాకయ్యారు. తర్వాత తేరుకుని నవ్వు ఆపుకొంటూ కామెంటరీ కొనసాగించారు. ఈ వీడియోను మాజీ క్రికెటర్ అలెగ్జాండ్ర హార్ట్లే సోషల్ మీడియాలో షేర్ చేయగా.. అదికాస్తా వైరల్​గా మారింది. ఆ వీడియో మీరూ చూసేయండి.

ఇవీ చూడండి: మహిళల ప్రపంచకప్ షెడ్యూల్ రిలీజ్​.. పాక్​తో భారత్ తొలి మ్యాచ్

ABOUT THE AUTHOR

...view details