ఇంగ్లాండ్‌తో ఐదు టెస్టుల సిరీస్‌కు యువ బ్యాట్స్‌మెన్ పృథ్వీ షా, దేవదత్ పడిక్కల్‌ను(Prithvi Shah, padikkal) తీసుకోకుండా, అభిమన్యు ఈశ్వరన్‌ను ఎంపిక చేయడం చర్చనీయాంశమవుతోంది. టీమ్ఇండియా మేనేజ్మెంట్ వారిని ఆడించాలని విజ్ఞప్తి చేసినప్పటికీ సెలక్షన్ కమిటీ ఛైర్మన్ చేతన్ శర్మ ఆ అభ్యర్థనను పట్టించుకోలేదని తెలిసింది! గాయపడిన శుభ్‌మన్ గిల్ స్థానాన్ని ఈ ఇద్దరిలో ఒకరితో భర్తీ చేయాలన్నది జట్టు యాజమాన్యం ఉద్దేశమని తెలుస్తోంది.
"న్యూజిలాండ్ ఫైనల్లో శుభమన్ గిల్ గాయపడ్డాడు. దీంతో ఇంగ్లాండ్‌తో టెస్టు సిరీస్‌కు పూర్తిగా దూరమయ్యాడు. కోలుకోవడానికి దాదాపు మూడు నెలల సమయం పడుతుంది. ఈ నేపథ్యంలో గతనెల చివర్లో ఇద్దరు ఓపెనర్లను యూకేకు పంపించాలని చేతన్ శర్మకు ఈమెయిల్ ద్వారా వినతి పంపించారు. కానీ దానిని శర్మ పట్టించుకోలేదు. అయితే షా, పడిక్కల్‌ను తీసుకోవాలని బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ, సెక్రటరీ షాకు ఎటువంటి విజ్ఞప్తి రాలేదు. ప్రస్తుతం ఈ క్రికెటర్లు శ్రీలంక పర్యటనలో ఉన్నారు. జులై 26న ఆ పర్యటన పూర్తవగానే ఇంగ్లాండ్ సిరీస్‌కు బయలుదేరే అవకాశముంది. కానీ టీమ్‌మేనేజ్‌మెంట్ వారిని మిగతా జట్టు బయోబుబుల్లోకి ప్రవేశించకముందే యూకేకు రప్పించాలని ఆశిస్తోంది" అని బీసీసీఐ ప్రతినిధి ఒకరు అన్నారు.