Irfan Pathan son: టీమ్ఇండియా మాజీ స్వింగ్ బౌలర్ ఇర్ఫాన్ పఠాన్ ఇంటికి రెండో వారసుడొచ్చాడు. అతడి భార్య సఫా మంగళవారం పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని సామాజిక మాధ్యమాల ద్వారా తెలియజేస్తూ సంతోషం వ్యక్తం చేశాడు ఇర్ఫాన్.
ఇర్ఫాన్ పఠాన్‌కు పుత్రోత్సాహం.. బిడ్డకు జన్మనిచ్చిన అతడి భార్య - Irfan Pathan son news
Irfan Pathan son: టీమ్ఇండియా మాజీ బౌలర్ ఇర్ఫాన్ పఠాన్ భార్య సఫా పండండి బిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని ఇర్ఫాన్ సామాజిక మాధ్యమాల వేదికగా తెలియజేశాడు.
![ఇర్ఫాన్ పఠాన్‌కు పుత్రోత్సాహం.. బిడ్డకు జన్మనిచ్చిన అతడి భార్య irfan pathan blessod with boy, irfans son, ఇర్ఫాన్ పఠాన్ సులేమాన్ ఖాన్, ఇర్ఫాన్ పఠాన్‌కు పుత్రోత్సాహం](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-14032148-655-14032148-1640687430610.jpg)
irfan pathan
"సఫా, నేను.. మా బాబు సులేమాన్ ఖాన్‌కు స్వాగతం పలుకుతున్నాం. బిడ్డతో పాటు తల్లి క్షేమంగా ఉంది" అంటూ ఇర్ఫాన్ ట్వీట్ చేశాడు.
ఫిబ్రవరి 4, 2016లో హైదరాబాద్‌కు చెందిన మోడల్ సఫాతో ఇర్ఫాన్ వివాహం జరిగింది. వీరిద్దరికీ అదే ఏడాది డిసెంబర్ 20న కొడుకు జన్మించాడు. ఇతడికి ఇమ్రాన్ ఖాన్ పఠాన్ అని నామకరణం చేశారు.