క్రికెట్ తనకు ఎదగనివ్వడం లేదనే ఆక్రోషంతో పంజాబ్‌లోని మొహాలీకి చెందిన సిమ్రన్‌జిత్ సింగ్ అలియాస్ సిమి సింగ్(Simi Singh).. హోటల్ మేనేజ్మెంట్ కోర్సు చేసేందుకు 2005లో ఐర్లాండ్ వెళ్లాడు. దేశం మారినా.. క్రికెట్‌పై తనకున్న అభిరుచి మాత్రం మారలేదు. చదువుతో పాటు క్రికెట్ అకాడమీలో శిక్షణ తీసుకొని.. డబ్లిన్‌లోని మలాహిడ్ క్రికెట్ క్లబ్లో చేరాడు. అక్కడి నుంచి అతడి దశ తిరిగింది. కట్ చేస్తే ఐర్లాండ్ జాతీయ జట్టులో(Ireland cricket team) స్థానం దక్కించుకున్నాడు.
8వ స్థానంలో సెంచరీతో అరుదైన రికార్డు..
దక్షిణాఫ్రికాతో జరిగిన వన్డే సిరీస్ ఆఖరి మ్యాచ్‌లో అద్భుతమైన బ్యాటింగ్ ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. 8వ స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన సిమి సింగ్.. సెంచరీ(Simi Singh century) సాధించి అందరినీ ఆశ్చర్యానికి గురిచేశాడు. వన్డే క్రికెట్ చరిత్రలో 8 లేదా అంతకంటే దిగువ స్థానంలో వచ్చి సెంచరీ చేసిన తొలి క్రికెటర్‌గా సిమి సింగ్ ఘనత సాధించాడు.