తెలంగాణ

telangana

ETV Bharat / sports

IRE VS IND 2023 : ఐర్లాండ్​తో రెండో టీ20.. ఆ సమస్యే టీమ్​ఇండియాకు పెద్ద లోటు.. బుమ్రాసేన ఏం చేస్తుందో? - ఐర్లాండ్ వర్సెస్ టీమ్ఇండియా రెడో టీ20 బుమ్రా

IRE VS IND 2023 : మరి కొన్ని గంటల్లో ఐర్లాండ్​తో రెండో టీ20 సిరీస్​ ప్రారంభంకానుంది. మ్యాచ్ ప్రివ్యూ తెలుసుకుందాం..

IRE VS IND 2023
IRE VS IND 2023 : ఐర్లాండ్​తో రెండో టీ20.. ఆ సమస్యే టీమ్​ఇండియాకు పెద్ద లోటు

By

Published : Aug 20, 2023, 7:26 AM IST

IRE VS IND 2023 : ఐర్లాండ్‌తో టీ20 సిరీస్‌ రీసెంట్​గా ప్రారంభమైంది. మొదటి మ్యాచ్ ముగిసింది. మరి కొన్ని గంటల్లో రెండో మ్యాచ్​ ప్రారంభంకానుంది. ఈ సిరీస్​ కోసం బరిలోకి దిగిన టీమ్​ఇండియా ద్వితీయ శ్రేణి జట్టు ప్రదర్శన ఆశాజనకంగానే ఉంది. వర్షం వల్ల తొలి మ్యాచ్​ మధ్యలోనే ఆగిపోయిన డక్‌వర్త్‌ లూయిస్‌ పద్ధతిలో విజయం సాధించింది. బౌలర్ల ప్రదర్శన అద్భుతం.

  • దాదాపు 11 నెలల తర్వాత జట్టులోకి అడుగుపెట్టిన బుమ్రా(bumrah ireland series) మొదటి మ్యాచ్‌లోనే మంచిగా రాణించాడు.
  • గాయం నుంచి కోలుకుని ఈ మ్యాచ్‌తోనే పునరాగమనం చేసిన మరో పేసర్‌ ప్రసిద్ధ్‌ కృష్ణ కూడా మంచి ప్రదర్శన చేశాడు. స్పిన్నర్‌ రవి బిష్ణోయ్‌ అద్భుతంగా ఆడాడు.
  • అయితే బౌలర్లు ఓ దశలో 59 పరుగులకే 6 వికెట్లు తీసినప్పటికీ.. ప్రత్యర్థిని 139 పరుగులు చేసే అవకాశమిచ్చారు. మ్యాచ్​ ఆరంభంలో అదరగొట్టి మధ్యలో బలహీనపడే అలవాటును అధిగమించాల్సిన అవసరం ఉంది. ఇదే టీమ్​ఇండియాకు లోటు. మొత్తంగా ఇప్పుడు రెండో మ్యాచ్‌లోనూ బౌలింగ్‌ విభాగంలో బుమ్రా(Irelnd Vs Bumrah) పైనే అందరి దృష్టి ఉంది.
  • ఇక ఇదే తొలి మ్యాచ్​లో భారత ఇన్నింగ్స్‌ 6.5 ఓవర్లే కొనసాగింది(IRE VS IND 2023 first T20). కాబట్టి బ్యాటర్ల ప్రదర్శన గురించి చెప్పడానికి పెద్దగా ఏమీ లేదు.
  • ఛేదనలో యశస్వి, రుతురాజ్‌ మంచి ఆరంభానిచ్చారు. కానీ ప్రత్యర్థి బౌలర్​ యంగ్‌ ఒకే ఓవర్లో రెండు వికెట్లు తీసి టీమ్​ఇండియాను కాస్త ఇబ్బంది పెట్టాడు. ఒకవేళ మ్యాచ్‌ పూర్తిగా సాగి.. అతడి జోరు కొనసాగి ఉండే భారత్‌ గెలుస్తుందా అన్నది అనుమానమే.
  • ఇక ఇదే సిరీస్‌తోనే ఇంటర్నేషనల్ క్రికెట్​లోకి అరంగేట్రం చేసిన రింకూ సింగ్‌.. తన సత్తా నిరూపించుకోవాలని ఎదురుచూస్తున్నారు. టీమ్​ఇండియా మొదట బ్యాటింగ్‌ చేస్తే తిలక్‌, రింకు, శివమ్‌ దూబె ఎలా ఆడతారన్నది ఆసక్తికరంగా ఉంది.
  • ఇక ఐర్లాండ్‌ టీ20ల్లో కాస్త డేంజర్ టీమే అయినప్పటికీ.. రీసెంట్​గా జరిగిన మొదటి మ్యాచ్‌లో ప్రధాన బ్యాటర్ల ఫెయిల్ అవ్వడంతో కాస్త ఇబ్బంది పడింది. స్టిర్లింగ్‌, బాల్‌బిర్నీ, టెక్టార్‌ లాంటి సీనియర్‌ బ్యాటర్లు ఆకట్టుకోలేకపోయారు. వీరి రెండో మ్యాచ్​లో రాణిస్తే భారత్​కు కాస్త కష్టమే. ప్రత్యర్థి జట్టు బౌలింగ్‌లోనూ లిటిల్‌, యంగ్‌, క్యాంఫర్‌ ఆ జట్టుకు ఎంతో కీలకమైన ప్లేయర్లు. ఇప్పుడీ రెండో మ్యాచ్​ పిచ్​ బ్యాటింగ్​కు అనుకూలంగా ఉంది.

జట్లు (అంచనా)

టీమ్​ఇండియా.. బుమ్రా (కెప్టెన్ ), రుతురాజ్, యశస్వి, తిలక్‌ వర్మ, రింకూసింగ్, సామ్సన్, సుందర్, దూబే, అర్ష్‌దీప్, ప్రసిధ్‌ కృష్ణ, బిష్ణోయ్,

ఐర్లాండ్‌..స్టిర్లింగ్‌ (కెప్టెన్ ), బల్బిర్నీ, టెక్టర్, టక్కర్, డాక్‌రెల్, క్యాంపర్, మెకార్తీ, మార్క్‌ అడైర్, జోష్‌ లిటిల్, యంగ్, బెన్‌వైట్‌.

ABOUT THE AUTHOR

...view details