Ireland cricketer retirement: ఐర్లాండ్ క్రికెట్ దిగ్గజం కెవిన్ ఒబ్రెయిన్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. "ఈ ఏడాది ఆస్ట్రేలియా వేదికగా జరుగనున్న టీ20 ప్రపంచకప్ టోర్నీ తర్వాత ఆట నుంచి వైదొలుగుదామని భావించాను. కానీ గత కొన్ని రోజులుగా నన్ను సెలక్టర్లు పక్కనపెడుతున్నారు. అందుకే రిటైర్మెంట్ ప్రకటిస్తున్నా. ఐర్లాండ్ జట్టుకు ఆడిన ప్రతి క్షణాన్ని ఆస్వాదించాను. ఈ ప్రయాణంలో ఎంతో మంది స్నేహితులను సంపాదించుకున్నాను. నాతో పనిచేసిన కోచ్‌లు.. సిబ్బందికి ధన్యవాదాలు. నాపై నమ్మకం ఉంచి అంతర్జాతీయ క్రికెట్‌లో ఆడే అవకాశం కల్పించిన అడీ బిరెల్, ఫిల్ సిమ్మన్స్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు. క్రికెటర్‌గా నా ప్రయాణంలో వెన్నంటి నిలిచిన నా కుటుంబ సభ్యులకు థాంక్యూ. నేను ఆటలో బిజీగా ఉన్న సమయంలో కుటుంబాన్ని జాగ్రత్తగా చూసుకున్న నా భార్య రూత్ అనీకి ప్రత్యేక ధన్యవాదాలు" అంటూ కెవిన్ తన నోట్‌లో పేర్కొన్నాడు." అని అన్నాడు.
స్టార్ క్రికెటర్ ఆటకు వీడ్కోలు, సెలక్టర్స్ వల్లే - కెవిన్ ఒబ్రెయిన్ రిటైర్మెంట్
Ireland cricketer retirement: ఐర్లాండ్ క్రికెట్ దిగ్గజం కెవిన్ ఒబ్రెయిన్ అభిమానులకు షాకింగ్ న్యూస్ చెప్పాడు. తన పదహారేళ్ల సుదీర్ఘ కెరీర్‌కు గుడ్‌బై చెప్పాడు.
ఐర్లాండ్ క్రికెటర్ రిటైర్మెంట్