Ireland: వెస్టిండీస్‌పై చారిత్రక సిరీస్ విజయం సాధించింది ఐర్లాండ్. ఆదివారం, మూడో వన్డేలో 2 వికెట్ల తేడాతో కరీబియన్ జట్టుపై గెలుపొంది సిరీస్‌ను కైవసం చేసుకుంది. దీంతో విదేశీ గడ్డపైన ఒక ఐసీసీ ఫుల్ మెంబర్‌పై తొలి సిరీస్ విజయాన్ని నమోదు చేసింది ఐర్లాండ్. ఇప్పటివరకు కేవలం రెండు సిరీస్‌లు గెలిచిన ఐర్లాండ్.. 2019లో జింబాబ్వేపై స్వదేశంలో తన తొలి సిరీస్‌ను దక్కించుకుంది.
ఐర్లాండ్ జట్టు సరికొత్త రికార్డు.. విదేశాల్లో తొలి సిరీస్ సొంతం - ఐర్లాండ్
Ireland: ఐర్లాండ్ క్రికెట్లో కొత్త అధ్యాయం మొదలైంది! విదేశీ గడ్డపై తొలి సిరీస్ విజయాన్ని నమోదు చేసింది ఆ జట్టు. వెస్టిండీస్‌తో ఆదివారం జరిగిన మూడో వన్డే గెలిచి, 2-1తో సిరీస్‌ను కైవసం చేసుకుంది.
తొలి వన్డే ఓడిపోయిన ఐర్లాండ్.. రెండో వన్డేలో గట్టిగా పునరాగమనం చేసింది. ఆదివారం జరిగిన సిరీస్‌లోని నిర్ణయాత్మక మ్యాచ్‌లో తొలుత వెస్టిండీస్‌ను 212 పరుగులకే కట్టడి చేసి.. 45 ఓవర్లలో 214/8 పరుగులతో లక్ష్యాన్ని పూర్తి చేసింది. 2-1 తేడాతో సిరీస్ కైవసం చేసుకుంది. ఐర్లాండ్ విజయంలో ఆండీ మెక్‌బ్రిన్ కీలక పాత్ర పోషించాడు. అటు బంతితో, ఇటు బ్యాటుతో అదరగొట్టాడు. మూడో వన్డేలో 4 వికెట్లతో పాటు 59 పరుగులు చేసి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్, ప్లేయర్ ఆఫ్ ది సిరీస్‌గా నిలిచాడు.
ఇదీ చూడండి:'భారత్‌ను ఆ జట్టు ఓడించడం ఆశ్చర్యంగా ఉంది'