IPL 2022 MI vs CSK: ఐపీఎల్ 2022లో డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ కథ ముగిసింది. ఇప్పటికే ప్లేఆఫ్స్ అవకాశాలను చేజార్చుకున్న ముంబయి చేతిలో చెన్నై ఓటమిపాలైంది. తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై 16 ఓవర్లలో 97 పరుగులకే కుప్పకూలింది. అనంతరం స్వల్ప లక్ష్య ఛేదనలో ముంబయి ఐదు వికెట్లను కోల్పోయి 14.5 ఓవర్లలో 103 పరుగులు చేసి విజయం సాధించింది. తిలక్ వర్మ (34*) రాణించగా.. రోహిత్ శర్మ (18), హృతిక్ షోకీన్ (18), టిమ్ డేవిడ్ (16*) ఫర్వాలేదనిపించారు. చెన్నై బౌలర్లలో ముకేశ్ చౌదరి 3.. సిమర్‌జిత్ సింగ్, మొయిన్ అలీ చెరో వికెట్ తీశారు.
IPL 2022 MI vs CSK: ఐపీఎల్ నుంచి చెన్నై ఔట్.. ముంబయి చేతిలో ఓటమి! - ముంబయి ఇండియన్స్ న్యూస్
IPL 2022 MI vs CSK: డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ ఐపీఎల్ నుంచి నిష్క్రమించింది. ముంబయితో జరిగిన మ్యాచ్‌లో 5 వికెట్ల తేడాతో పరాజయం పాలైంది.
అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన చెన్నై సూపర్ కింగ్స్ జట్టు 97 పరుగులకే కుప్పకూలింది. చెన్నై బ్యాటర్లలో కెప్టెన్ ఎంఎస్ ధోనీ (36*) మినహా ఎవరూ రాణించలేదు. దీంతో ముంబయికి 98 పరుగులను లక్ష్యంగా నిర్దేశించింది. ముంబయి బౌలర్ల ధాటికి ముగ్గురు చెన్నై బ్యాటర్లు డేవన్ కాన్వే, మొయిన్ అలీ, తీక్షణ డకౌట్‌గా వెనుదిరిగారు. రుతురాజ్ గైక్వాడ్ 7, రాబిన్ ఉతప్ప 1, అంబటి రాయుడు 10, శివమ్ దూబే 10, డ్వేన్ బ్రావో 12, ముకేశ్ చౌదరి 4 పరుగులు చేశారు. ధోనీ తర్వాత అత్యధిక స్కోరు అదనపు పరుగులే (15) కావడం విశేషం. మ్యాచ్ ప్రారంభంలో విద్యుత్ సమస్యతో డీఆర్‌ఎస్ అందుబాటులో లేకపోవడం కూడానూ చెన్నైకి కలిసిరాలేదు. ముంబయి బౌలర్లలో డానియల్ 3, కుమార్ కార్తికేయ 2, మెరెడిత్ 2.. రమణ్‌దీప్, బుమ్రా చెరో వికెట్ తీశారు.
ఇదీ చదవండి:దంచికొట్టిన మార్ష్, వార్నర్.. రాజస్థాన్‌పై దిల్లీ విజయం