Youth Arrested For Broadcasting IPL: ఐపీఎల్ మ్యాచ్‌ను తన సొంత యాప్‌లో ప్రసారం చేస్తున్న యువకుడిని హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఇతడిని తమిళనాడు శివగంగై సమీపంలోని కంజిరంగల్కు చెందిన రామమూర్తి(29)గా పోలీసులు గుర్తించారు. కాగా ఇతడిపై 2021 లోనే కేసు నమోదైంది.
మామూలోడు కాదు.. ఐపీఎల్ మ్యాచ్‌లను సొంత యాప్‌లో పెట్టేశాడు! - ఐపీఎల్ 2022 న్యూస్
Youth Arrested For Broadcasting IPL: తన సొంత యాప్ ద్వారా ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్‌ను ప్రసారం చేస్తున్న ఓ యువకుడిని హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. తమిళనాడు శివగంగైకి చెందిన రామమూర్తిని పోలీసులు అక్కడికి వెళ్లి అదుపులోకి తీసుకున్నారు.
రామమూర్తి 2021లో ఎలాంటి అనుమతి లేకుండా ఐపీఎల్‌ను ప్రత్యేక ప్రసారం చేశాడు. అయితే దీనిపై హైదరాబాద్‌లోని బంజారాహిల్స్ ప్రాంతానికి చెందిన కడారం తుప్పా అనే వ్యక్తి సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసి విచారణ చేపట్టిన పోలీసులు.. శివగంగై వెళ్లి అతడిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం శివగంగై కోర్టులో హాజరుపరిచి హైదరాబాద్‌కు తరలించారు. ఉన్నత చదువు పూర్తయ్యాక ఉద్యోగం లేకపోవడం వల్లే ఇలా చేశానని రామమూర్తి పోలీసులకు తెలిపాడు.
ఇదీ చదవండి:ఫించ్‌తో మాటల యుద్ధం.. భారత క్రికెటర్‌పై నెటిజన్ల ఆగ్రహం!