పంజాబ్‌తో మ్యాచ్‌లో దాదాపు తమ జట్టును గెలిపించేంత పని చేసిన రాజస్థాన్ కెప్టెన్‌పై.. పలువురు క్రికెటర్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. కేవలం 63 బంతుల్లోనే 119 పరుగులు సాధించిన శాంసన్.. గెలుపునకు కేవలం 5 పరుగుల ముంగిట పెవిలియన్ చేరాడు.
మ్యాచ్ ఓడిపోయినప్పటికీ అభిమానుల మనుసులు గెలిచావంటూ సీఎస్కే ఆటగాడు సురేష్ రైనా ట్వీట్ చేశాడు. "అద్భతమైన ఇన్నింగ్స్ ఆడావు. నువ్వు ఈరోజు కచ్చితంగా చాలా హృదయాలను గెలుచుకుంటావు. ఇలాగే ఆడు" అని కొనియాడాడు.
ఇదీ చదవండి:'మాస్టర్' పాటకు దిల్లీ క్రికెటర్ల చిందులు.. వీడియో వైరల్