తెలంగాణ

telangana

ETV Bharat / sports

రాజస్థాన్ ఆటగాడు పరాగ్​కు కోహ్లీ సలహా - క్రికెట్ న్యూస్

రాజస్థాన్ రాయల్స్ యువ క్రికెటర్ రియాన్ పరాగ్​కు బ్యాటింగ్ విషయమై ఆర్సీబీ కెప్టెన్ కోహ్లీ ఓ సలహా ఇచ్చాడు. ఇంతకీ అదెంటంటే?

You are not going to get the Orange Cap: Riyan Parag reveals Virat Kohli's advice on batting
రాజస్థాన్ ఆటగాడు పరాగ్​కు కోహ్లీ సలహా

By

Published : Apr 15, 2021, 8:47 PM IST

ఆరెంజ్ క్యాప్​ కోసం కలలు కంటున్న తనకు కోహ్లీ గత సీజన్​లో ఇచ్చిన సలహా గురించి చెప్పాడు రాజస్థాన్ ఆటగాడు రియాన్ పరాగ్. దిల్లీతో మ్యాచ్​ ప్రారంభానికి ముందు ఈ విషయాన్ని పంచుకున్నాడు.

"గత సీజన్​లో కోహ్లీతో మాట్లాడినప్పుడు నాకు అతడో విలువైన సలహా ఇచ్చాడు. ఐదు లేదా ఆరో స్థానంలో బ్యాటింగ్​ చేసే నువ్వు.. ఆరెంజ్ క్యాప్ ఎలా అందుకుంటావ్? అది సాధ్యం కాదు. కాబట్టి దాని గురించి ఆలోచించడం మానేసి జట్టు కావాల్సిన పరుగులపై దృష్టి పెట్టమని నాకు చెప్పాడు. అప్పటి నుంచి నేను చేస్తున్న పరుగులు జట్టుకు ఉపయోగపడుతున్నాయా లేదా అనే విషయాన్నే చూస్తూన్నా" అని పరాగ్ చెప్పాడు.

పంజాబ్​ కింగ్స్​తో జరిగిన తొలి మ్యాచ్​లో 11 బంతుల్లో 25 పరుగులు చేసిన పరాగ్.. కెప్టెన్​ సంజూ శాంసన్​కు తనవంతు సాయం చేశాడు. కానీ జట్టును గెలిపించలేకపోయాడు.

ABOUT THE AUTHOR

...view details