IPL 2023 RR vs KKR : ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2023లో భాగంగా రాజస్థాన్ రాయల్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ మధ్య మ్యాచ్ జరిగింది. కోల్‌కతా నిర్దేశించిన 150 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్థాన్ దంచికొట్టింది. కేవలం ఒక్క వికెట్ నష్టానికి టార్గెట్ ఛేదించింది. దీంతో కోల్‌కతాపై రాజస్థాన్ రాయల్స్ 9 వికెట్ల తేడాతో విజయం సాధించింది. రాజస్థాన్ ప్లేయర్ యశస్వి జైస్వాల్ (98*) సంచలన ప్రదర్శన చేశాడు. ఐపీఎల్చరిత్రలోనే అత్యంత వేగవంతమైన అర్ధ సెంచరీని నమోదు చేశాడు. కేవలం 13 బంతుల్లో ఈ రికార్డును నెలకొల్పాడు. మరో ప్లేయర్ సంజూ శాంసన్ (48*) అద్భుత ప్రదర్శన చేశాడు. ఓపెనర్ బట్లర్ డకౌట్ కాగా.. ఇద్దరే మ్యాచ్‌ను ముగించడం విశేషం.
యశస్వి జైస్వాల్ సంచలనం.. 13 బంతుల్లో 50.. రాజస్థాన్ ఘన విజయం - రాజస్థా కోల్‌కతా మ్యాచ్ వెంకటేశ్ అయ్యర్
IPL 2023 RR vs KKR : ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2023లో భాగంగా రాజస్థాన్ రాయల్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ మధ్య మ్యాచ్ జరిగింది. రాజస్థాన్ ప్లేయర్ యశస్వి జైస్వాల్ సంచలన ప్రదర్శన చేశాడు. ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత వేగవంతమైన అర్ధ సెంచరీని నమోదు చేశాడు. దీంతో కోల్‌కతాపై రాజస్థాన్ రాయల్స్ 9 వికెట్ల తేడాతో విజయం సాధించింది.
అంతకుముందు, టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్.. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 149 పరుగులు చేసింది. ఓపెనర్లు జేసన్ రాయ్ (10), గుర్భాజ్ (18) ఆశించిన స్థాయిలో రాణించలేదు. ఆ తర్వాత దిగిన వెంకటేశ్ అయ్యర్ (57) హాఫ్ సెంచరీతో అదరగొట్టాడు. స్కోర్ బోర్డును కాస్త పరుగులు పెట్టించాడు. ఆ తర్వాత వచ్చిన నితీశ్ రాణా (22) ఫర్వాలేదనిపించగా.. రస్సెల్(10), రింకూ సింగ్ (16) పరుగులు చేశారు. ఆ తర్వాత వచ్చిన బ్యాటర్లు సింగిల్ డిజిట్ స్కోరుకే వెనుదిరిగారు. ఇక, రాజస్థాన్ బౌలర్లలో చాహల్ 4 వికెట్లు తీసి చెలరేగిపోయాడు. బౌల్డ్ రెండు వికెట్ల తీయగా.. సందీప్ శర్మ, అసిఫ్ చెరో వికెట్ పడగొట్టారు.
ఐపీఎల్ చరిత్రలోనే ఫాస్టెస్ట్ 50.. యశస్వి రికార్డ్
యువ సంచలనం యశస్వి జైస్వాల్.. గురువారం కోల్‌కతాతో జరిగిన మ్యాచ్‌లో వీర విహారం చేశాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ చరిత్రలోనే అత్యంత వేగంగా అర్ధ సెంచరీ బాది.. సరికొత్త రికార్డును నెలకొల్పాడు. 13 బంతుల్లో ఈ నయా రికార్డును సృష్టించాడు. ఓపెనర్‌గా దిగిన యశస్వి జైస్వాల్.. మొత్తం 98* పరుగులు చేశాడు. 5 సిక్స్‌లు, 13 ఫోర్లతో మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు.