ఐపీఎల్ 14వ సీజన్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వరుస విజయాలతో దూసుకుపోతోంది. అయితే, ఇక్కడ కూడా ఆ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ.. ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ (డబ్ల్యూటీసీ) గురించి ఆలోచిస్తున్నాడని తెలిసింది. సౌథాంప్టన్ వేదికగా జూన్ 18 నుంచి న్యూజిలాండ్‌తో టీమ్‌ఇండియా డబ్ల్యూటీసీ ఫైనల్లో తలపడనుంది. అయితే, ఆ మ్యాచ్‌లో డ్యూక్ బాల్స్‌ను వినియోగించనున్నారు. ఈ క్రమంలోనే అక్కడ రాణించడానికి కోహ్లీ ఏ చిన్న అవకాశాన్నీ వదులుకోవడం లేదు. అందుకు సంబంధించిన ఓ ఉదాహరణను ఆర్సీబీ ఆల్‌రౌండర్ డానియెల్ క్రిస్టియన్ ఓ యూట్యూబ్ ఛానెల్‌తో పంచుకున్నాడు.
"విరాట్ చాలా తెలివైన వాడు. ఐపీఎల్ ప్రారంభమైన తొలి వారంలో నేనూ, అతడు, కైల్ జేమీసన్ నెట్స్‌లో సాధన చేసి ఓ చోట కూర్చున్నాం. ఆ సమయంలో వాళ్లిద్దరూ టెస్టు క్రికెట్ గురించి మాట్లాడుకున్నారు. అప్పుడే జేమీసన్ తన వద్ద డ్యూక్ బాల్స్ ఉన్నాయని చెప్పాడు. ఇక్కడ ప్రాక్టీస్ చేసేందుకు వాటిని తీసుకొచ్చానని అన్నాడు. దాంతో కోహ్లీ.. జేమీని తన బుట్టలో వేసుకోవాలని చూశాడు. ప్రాక్టీస్ చేసేటప్పుడు ఆ బంతులను తనకు వేయమని కోహ్లీ అడిగాడు. కానీ, అలా చేయనని న్యూజిలాండ్ పేసర్ జవాబిచ్చాడు"
- డానియెల్ క్రిస్టియన్, ఆర్సీబీ ఆటగాడు
అయితే వారిద్దరి మధ్య సంభాషణ ఇలా జరిగిందని చెప్పాడు డానియెల్ క్రిస్టియన్.
కోహ్లీ:జేమీ నువ్వు డ్యూక్ బాల్స్‌తో ఎక్కువగా బౌలింగ్ చేశావా?