వచ్చే ఏడాది ఐపీఎల్ కోసం రెండు కొత్త ఫ్రాంచైజీలు(IPL 2022 new teams) సిద్ధమవుతున్నాయి. ఈ క్రమంలో అందులో ఓ జట్టుకు సారథిగా వ్యవహరించే అవకాశం వస్తే బాగుంటుందని ఆశాభావం వ్యక్తం చేశాడు సన్‌రైజర్స్ హైదరాబాద్ మాజీ కెప్టెన్ డేవిడ్ వార్నర్(David Warner IPL News). ఎస్ఆర్హెచ్ వరుస ఓటములు, వార్నర్ పేలవ ప్రదర్శన కారణంగా అతడిని కెప్టెన్‌గా తొలగిస్తూ ఫ్రాంచైజీ కీలక నిర్ణయం తీసుకుంది. కెప్టెన్ బాధ్యతలు విలియమ్సన్కు(Williamson SRH Captain) అప్పగించింది. ఈ నేపథ్యంలో కారణం కూడా చెప్పకుండా తనను కెప్టెన్సీ నుంచి తప్పించారని నిరాశ చెందాడు వార్నర్. ఇకపై సన్‌రైజర్స్‌కు ప్రాతినిథ్యం వహించబోనని ఇన్‌స్టా పోస్ట్‌లో తెలిపాడు.
అక్టోబర్ 25న బీసీసీఐ రెండు కొత్త ఫ్రాంచైజీలను(IPL 2022 new teams) ప్రకటించనున్న నేపథ్యంలో వార్నర్ వ్యాఖ్యలకు ప్రాధాన్యం ఏర్పడింది. "వచ్చే ఏడాది ఐపీఎల్లో రెండు కొత్త జట్లు చేరనున్నాయి. ఏదైనా ఫ్రాంచైజీకి కెప్టెన్ బాధ్యతలు స్వీకరించేందుకు సిద్ధంగా ఉన్నా. ఆ బాధ్యతతో నేను బాగా ఆడతా. ఆటను బాగా ఎంజాయ్ చేస్తా" అని వార్నర్ తెలిపాడు.