తెలంగాణ

telangana

ETV Bharat / sports

2016 రిపీట్​.. సన్​రైజర్స్​దే ఐపీఎల్ టైటిల్! - 2016 రిపీట్​.. సన్​రైజర్స్​దే ఐపీఎల్ టైటిల్!

ఐపీఎల్​లో తమ మూడో పోరులో ముంబయి ఇండియన్స్​తో తలపడేందుకు సిద్ధమైంది సన్​రైజర్స్ హైదరాబాద్. అయితే ఈ మ్యాచ్ కంటే ముందు సన్​రైజర్స్ ఈసారి విజేతగా నిలుస్తుందంటూ కొన్ని వార్తలు వస్తున్నాయి. అవేంటో చూద్దాం.

Sunrisers
సన్​రైజర్స్​

By

Published : Apr 17, 2021, 6:36 PM IST

Updated : Apr 17, 2021, 7:31 PM IST

ఐపీఎల్‌ 2021 సీజన్లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్​ మూడో మ్యాచ్‌లో ముంబయి ఇండియన్స్‌తో తలపడబోతోంది. అభిమానులంతా సన్‌రైజర్స్‌ బోణీ ఎప్పుడు కొడుతుందా అని ఎదురు చూస్తున్నారు. కానీ గెలుపు లెక్కల్లో పోలికల మెలికలు చూస్తూ ఒకింత ఆనందంగానూ ఉన్నారు. భారీ అంచనాలు సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ మీద ఎప్పుడూ లేవు. ఈ ఏడాది కూడా అంతే. కానీ గణాంకాలు మాత్రం ఓ తమాషాను చూపిస్తున్నాయి. ఈ ఏడాది కప్‌ నెగ్గే సూచనలివే అంటున్నాయి.

ఏంటా లెక్క?

2016 ఐపీఎల్‌ సీజన్‌ విజేతగా నిలిచింది సన్​రైజర్స్. బౌలర్లు, బ్యాట్స్‌మెన్‌ కలిసికట్టుగా సాధించిన విజయమది. డేవిడ్‌ వార్నర్‌ సారథ్యంలో ఆ ఏడాది సన్‌రైజర్స్‌ జట్టు అలరించింది. అయితే ఆ సీజన్‌లో ఆట అనుకున్నంత సులువుగా సాగలేదు. మొదట రెండు మ్యాచుల్నీ రైజర్స్‌ ఓడిపోయిది. మూడో మ్యాచ్‌లో నెగ్గి దూసుకుపోయారు.

ఇందులో విశేషం ఏముంది?

2016 ఐపీఎల్‌ సీజన్‌లో సన్‌రైజర్స్‌ను ఓడించిన రెండు జట్లు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు‌, కోల్‌కతా నైట్‌రైడర్స్‌. 2021 సీజన్‌లో కూడా మొదటి రెండు మ్యాచులూ ఈ జట్ల చేతిలోనే ఓడిపోయింది. రెండు సీజన్లలోనూ సన్‌రైజర్స్‌ మొదటి మ్యాచ్‌ల స్కోరు 170 దాటింది. అలాగే రెండో మ్యాచ్‌లో కూడా స్కోరు 140 దాటింది. అంతే కాదు.. 2016లో మూడో మ్యాచ్‌ ముంబయితో ఆడి గెలిచారు. 2021లో కూడా మూడో మ్యాచ్‌ ముంబయితోనే ఆడాల్సి ఉంది. ఇది గానీ గెలిస్తే.. గెలుపు గాలి సోకిందనే అనుకోవాలంటున్నారు అభిమానులు. మరి సన్‌రైజర్స్‌ శకునం ఎలా ఉందో చూడాలి.

Last Updated : Apr 17, 2021, 7:31 PM IST

ABOUT THE AUTHOR

...view details