తెలంగాణ

telangana

ETV Bharat / sports

'వార్నర్‌లా కోచ్‌లను తీసేయగలరా?' - ipl sunil gavaskar

వార్నర్​ను కెప్టెన్సీ నుంచి తప్పించి తుదిజట్టులోనూ చోటు ఇవ్వకపోవడం ఆశ్చర్యమేసిందని అన్నాడు భారత దిగ్గజం సునీల్​ గావస్కర్​. సీజన్‌ మధ్యలోనే కెప్టెన్‌ను మార్చినట్టు కోచ్‌లతోనూ వ్యవహరించగలరా అని ప్రశ్నించాడు.

warner
వార్నర్​

By

Published : May 13, 2021, 8:14 PM IST

సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ సారథిగా డేవిడ్‌ వార్నర్‌ను తొలగించిన రీతిలోనే కోచ్‌లతోనూ వ్యవహరించగలరా అని క్రికెట్‌ దిగ్గజం సునిల్‌ గావస్కర్‌ ప్రశ్నించాడు. నాయకుడిగా తీసేసినా జట్టులో వార్నర్‌కు చోటివ్వకపోవడం ఆశ్చర్యకరమని పేర్కొన్నాడు. అతడు తిరుగులేని బ్యాట్స్‌మన్‌ అని అభిప్రాయపడ్డాడు.

"డేవిడ్‌ వార్నర్‌ను నాయకత్వం నుంచి తొలగించడమే కాకుండా తుది జట్టులో చోటివ్వని నిర్ణయంపై హైదరాబాద్‌ ఆలోచిస్తుందని అనుకుంటున్నా. వార్నర్‌ పరుగులు చేశాడు. అయితే మునుపట్లా ఆధిపత్యం వహిస్తూ కాదు. మిగతా ఆటగాళ్లతో పోలిస్తే అతడివి విలువైన పరుగులే. తుది జట్టులోనూ అతడికి చోటివ్వకపోవడం ఆశ్చర్యకరం. సారథ్యాన్ని పక్కనపెడితే అతడో తిరుగులేని బ్యాటర్. నాయకుడిగా, ఆటగాడిగా వార్నర్‌ను పక్కన పెట్టడం ఎక్కువ కాలమే చర్చనీయం అవుతుంది. సీజన్‌ మధ్యలోనే కెప్టెన్‌ను మార్చినట్టు కోచ్‌లతోనూ వ్యవహరిస్తారా అన్నదే ప్రశ్న. ఫుట్‌బాల్‌లో జట్టు ఓటములు మొదలవ్వగానే మొదట మేనేజర్‌నే తొలగిస్తారు. క్రికెట్‌లోనూ అలా ఎందుకు చేయకూడదు? ఇక టోర్నీ నిరవధికంగా వాయిదా పడటం అంతర్గతంగా, ప్రశాంతంగా ఆలోచించేందుకు మంచి అవకాశం"

-సన్నీ, టీమ్​ఇండియా మాజీ క్రికెటర్​.

ఐపీఎల్‌-2021లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ పేలవ ప్రదర్శన చేసింది. ఏడు మ్యాచులాడి ఒకటి మాత్రమే గెలిచింది. ఆ జట్టు బ్యాటింగ్‌ విభాగంలో లోపాలు కనిపించాయి. కలిసికట్టుగా ఆడినట్టు అనిపించలేదు. జట్టు యాజమాన్యం, సారథి ఆలోచనలలో విభేధాలు వచ్చినట్లు తెలిసింది. ఆటగాళ్ల ఎంపిక విషయంలో వార్నర్‌ అసంతృప్తి వ్యక్తం చేశాడు. దాంతో ఆగ్రహించిన ఫ్రాంచైజీ అతడిని సారథ్యం నుంచి తొలగించింది. అంతేకాకుండా రాజస్థాన్‌ మ్యాచులో తుది జట్టులో చోటివ్వలేదు. 6 ఇన్నింగ్స్‌ల్లో వార్నర్‌ 32+ సగటుతో 193 పరుగులు చేశాడు.

ఇదీ చూడండి: 'కెప్టెన్​గా తప్పించినా వార్నర్​కు అదే ఆలోచన'

ABOUT THE AUTHOR

...view details