డిఫెండింగ్ చాంపియన్ ముంబయి ఇండియన్స్.. ఐపీఎల్ రెండో దశ టోర్నీలో ఆడిన రెండు మ్యాచ్ ల్లోనూ ఓడిపోయింది. జట్టుకు సమతూకాన్ని తెచ్చే ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్య(hardik pandya ipl) అందుబాటులో లేకపోవడం ఆ జట్టును బాగా దెబ్బ తీసింది. అయితే హార్దిక్ ఇంకా బరిలో దిగకపోవడం ముంబయికి మాత్రమే కాదు టీమ్ఇండియాను కూడా కలవరపరిచే అంశమే. టీ20 ప్రపంచకప్(t20 world cup 2021) ఎంతో దూరంలో లేని నేపథ్యంలో ఈ స్టార్ ఆల్‌రౌండర్ మ్యాచ్ ఫిట్నెస్ సాధించడం ఎంతో ముఖ్యం.
2021 ఐపీఎల్ ఆరంభంలో శిక్షణలో గాయపడిన పాండ్య(hardik pandya ipl).. ఈ సీజన్లో తొలి అంచెలో ఆడిన 3 మ్యాచుల్లో బౌలింగ్ చేయలేదు. బ్యాటింగ్‌లోనూ పెద్దగా రాణించలేదు. ప్రపంచకప్‌నకు ఎంపికైన ఏ భారత ఆటగాడినీ 100 శాతం ఫిట్‌గా లేకుండా ఐపీఎల్లో ఆడించకూడదని ఫ్రాంచైజీలకు బీసీసీఐ సూచించిన నేపథ్యంలో పాండ్యను ముంబయి బరిలో దించట్లేదు.