బుధవారం రాత్రి వాంఖడే స్టేడియం వేదికగా చెన్నై సూపర్ కింగ్స్, కోల్‌కతా నైట్‌రైడర్స్ మధ్య జరిగిన పోరు రసవత్తరంగా సాగింది. చివరకు ధోనీసేన 18 పరుగుల తేడాతో కోల్‌కతాను మట్టికరిపించింది. అయితే ఈ మ్యాచ్‌లో కోల్‌కతా బ్యాట్స్‌మెన్ ప్రదర్శించిన పోరాట పటిమను ఆ జట్టు సహ యాజమాని షారూక్‌ఖాన్ ప్రశంసించాడు. ముఖ్యంగా రసెల్, దినేశ్ కార్తీక్, కమిన్స్‌లు పోరాడిన తీరును మెచ్చుకున్నాడు.
"ఈ రోజు రాత్రి మనం ఓడిపోయి ఉండొచ్చు. మీరు (కోల్‌కతా బ్యాట్స్‌మెన్) పవర్ ప్లేలో మినహాయిస్తే అద్భుతంగా ఆడారు. వెల్ డన్ బాయ్స్.. రసెల్, కమిన్స్, దినేశ్ కార్తీక్ ఇలాంటి మంచి ప్రదర్శనలు ఇవ్వడాన్ని అలవాటుగా చేసుకోండి. మేము తిరిగి వస్తాము."