చెన్నై సూపర్‌కింగ్స్ కెప్టెన్ ధోనీ.. ఈసారి ఐపీఎల్లో బ్యాటింగ్‌తో అలరించేందుకు సిద్ధమవుతున్నాడు! ఐపీఎల్ ప్రాక్టీసులో భాగంగా సిక్సులు కొడుతూ కనిపించడమే ఇందుకు కారణం. దీంతో అభిమానులకు ఆనందానికి అవధుల్లేకుండా పోయింది. అందుకు సంబంధించిన ఓ వీడియోను చెన్నై జట్టు ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది.
సిక్సులు కొడుతూ కెప్టెన్ ధోనీ బిజీ బిజీ - ఐపీఎల్ లేటేస్ట్ న్యూస్
ప్రాక్టీసులో భాగంగా స్టేడియం నలుమూలలకు సిక్సులు కొడుతూ కనిపించాడు మహేంద్ర సింగ్ ధోనీ. ఈ వీడియోను చెన్నై సూపర్‌కింగ్స్.. ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది.
సిక్సులు కొడుతూ ధోనీ బిజీ బిజీ
గతేడాది ఫ్లేఆఫ్స్‌కు చేరడంలో విఫలమైన చెన్నై జట్టు.. ఈసారి ఎలాగైనా సరే కప్పు కొట్టాలనే ప్రణాళికతో బరిలోకి దిగుతోది. గత సీజన్‌కు దూరమైన రైనా.. ఈసారి ఆడనుండటం సీఎస్కేకు కలిసొచ్చే అంశం. అలానే ఫిబ్రవరిలో జరిగిన వేలంలో మొయిన్ అలీ, కృష్ణప్ప గౌతమ్, రాబిన్ ఉతప్ప లాంటి ప్లేయర్లను కొనుగోలు చేసిందీ జట్టు. ఏప్రిల్ 10న తన తొలి మ్యాచ్‌లో దిల్లీ క్యాపిటల్స్‌తో చెన్నై తలపడనుంది.