తెలంగాణ

telangana

ETV Bharat / sports

ఐపీఎల్​ వేలంలో అన్​సోల్డ్​పై ఫించ్​ రియాక్షన్

ఇటీవలే జరిగిన ఐపీఎల్ వేలంపై ఆస్ట్రేలియా పరిమిత ఓవర్ల కెప్టెన్​ ఆరోన్​ ఫించ్​ స్పందించాడు. 14వ సీజన్​ కోసం తాను అమ్ముడుపోక పోవడంపై ఆశ్చర్యపోలేదని ఫించ్​ తెలిపాడు.

Wasn't unexpected: Finch on going unsold at IPL auctions
ఐపీఎల్​ వేలంలో అన్​సోల్డ్​పై ఫించ్​ రియాక్షన్

By

Published : Feb 22, 2021, 7:37 AM IST

ఐపీఎల్‌ ఆటగాళ్ల వేలంలో అమ్ముడుపోనందుకు ఆశ్చర్యపోలేదని ఆస్ట్రేలియా పరిమిత ఓవర్ల జట్టు సారథి ఆరోన్‌ ఫించ్‌ అన్నాడు. కొన్ని నెలలుగా వరుస పర్యటనలతో తీరిక లేకుండా గడుపుతున్న కారణంగా.. ఈ సమయాన్ని కుటుంబంతో గడిపుతానని చెప్పాడు.

"నిజాయతీగా చెప్పాలంటే వేలం పాటలో అమ్ముడవకపోవడం నాకు ఆశ్చర్యం కలిగించలేదు. ఎప్పుడైనా క్రికెట్‌ ఆడటానికే ఇష్టపడతా. కానీ ఇంట్లో కొంత సమయం గడపడం కూడా మంచిదే. ఆగస్టులో ఇంగ్లాండ్‌కు వెళ్లినప్పటి నుంచి తీరికలేకుండా గడుపుతున్నాం. కొన్నిసార్లు క్వారంటైన్‌లో ఉన్నాం. ఎక్కువగా బబుల్‌లో గడిపాం. ఇంట్లో సమయం గడిపితే పునరుత్తేజితం కావొచ్చు."

- ఆరోన్​ ఫించ్​, ఆస్ట్రేలియా క్రికెటర్​

2020 ఐపీఎల్‌లో బెంగళూరు తరఫున ఫించ్‌ కేవలం 22.3 సగటు నమోదు చేశాడు. బిగ్‌బాష్‌ లీగ్‌లోనూ తన ప్రదర్శనతో ఆకట్టుకోలేకపోయాడు.

ఇదీ చూడండి:ఐపీఎల్ వేలం: ఫ్రాంఛైజీల ఉత్తమ, అనూహ్య నిర్ణయాలు ఇవే!

ABOUT THE AUTHOR

...view details