ఐపీఎల్ 14వ సీజన్ తొలి దశలో ఎలా ఆడామో ఇప్పుడూ అలాగే ఆడతామని.. అంతే ప్యాషన్, పట్టుదలతో బరిలోకి దిగుతామని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(Rcb Team 2021) కెప్టెన్ విరాట్ కోహ్లీ(Virat Kohli) స్పష్టం చేశాడు. తొలుత ఏప్రిల్ 9న మొదలైన ఈ సీజన్ కరోనా విజృంభణ కారణంగా నిరవధికంగా వాయిదా పడింది. ఆదివారం(సెప్టెంబరు 19) నుంచి యూఏఈలో తిరిగి ప్రారంభం కానుంది(IPL 2021 Second Phase). ఆర్సీబీ సోమవారం కోల్‌కతాతో తలపడనుంది. ఈ సందర్భంగా కోహ్లీ రానున్న సీజన్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
'తొలి భాగంలో ఉన్న ఆస్ట్రేలియా ఆటగాళ్లు ఆడం జంపా, కేన్ రిచర్డ్‌సన్ ఇప్పుడు ఆడటం లేదు. వారి స్థానాల్లో శ్రీలంక ఆటగాళ్లు వానిండు హసరంగ, చమీర దుష్మంత జట్టులోకి వచ్చారు. వీరికి యూఏఈ లాంటి పిచ్‌లపై ఎలా ఆడాలో బాగా తెలుసు. వీళ్ల నైపుణ్యాలు మా జట్టుకు(RCB Team Changes) బాగా ఉపయోగపడతాయి. వీరి చేరికతో జట్టు మరింత బలోపేతంగా తయారవుతుంది' అని కోహ్లీ చెప్పాడు.