ముగిసిన కోహ్లీ కెప్టెన్ ఇన్నింగ్స్.. రికార్డులివే! - ఐపీఎల్ 2021
ఐపీఎల్ 2021(IPL 2021 News)లో భాగంగా ఎలిమినేటర్ మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్ చేతిలో ఓటమిపాలై ఇంటిముఖం పట్టింది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(kkr vs rcb 2021). దీంతో ఒక్కసారి కూడా టైటిల్ గెలవకుండానే తన ఐపీఎల్ కెప్టెన్సీ(virat kohli captaincy in ipl) ఇన్నింగ్స్‌ను ముగించాడు విరాట్. ఈ నేపథ్యంలో అతడి సారథ్యంలో నెలకొల్పిన రికార్డులేంటో చూద్దాం.
ఐపీఎల్ 2021(IPL 2021 News)లో భాగంగా కోల్‌కతా నైట్‌రైడర్స్(kkr vs rcb 2021)తో జరిగిన మ్యాచ్‌లో ఓటమిపాలైంది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. ఫలితంగా ఆర్సీబీ కెప్టెన్(virat kohli captaincy in ipl)గా విరాట్ కోహ్లీ ప్రయాణం ముగిసింది. గత 10 ఏళ్లుగా ఆ జట్టుకు సారథ్యం వహిస్తున్న విరాట్.. జట్టుకు ట్రోఫీ మాత్రం అందించలేకపోవడం అభిమానులను తీవ్రంగా కలిచివేస్తోంది. ఐపీఎల్(ipl news) ప్రారంభమైన 2008 నుంచి ఆర్సీబీకే ఆడుతున్న ఇతడు.. 2011లో వెటోరీ నుంచి కెప్టెన్సీ బాధ్యతలు అందుకున్నాడు. అప్పటి నుంచి ఈ ఫ్రాంచైజీతోనే ఉన్న కోహ్లీ.. ఎంతోమంది అభిమానుల్ని సంపాదించుకున్నాడు. ఆర్సీబీ ఫ్యాన్ ఫాలోయింగ్‌ను పెంచాడు. ఈ నేపథ్యంలో కోహ్లీ కెప్టెన్‌గా సాధించిన రికార్డులపై ఓ లుక్కేద్దాం.
- ఐపీఎల్ కెప్టెన్‌గా అత్యధిక పరుగులు సాధించిన జాబితాలో అగ్రస్థానంలో ఉన్నాడు కోహ్లీ. ఇతడి ఖాతాలో 4881 రన్స్ ఉన్నాయి.
- ఓ ఐపీఎల్ సీజన్లో అత్యధిక పరుగులు (973) చేసిన కెప్టెన్‌గానూ కోహ్లీకి రికార్డుంది.
- లీగ్‌లో కెప్టెన్‌గా 5 సెంచరీలు బాదాడు కోహ్లీ. ఇది కూడా రికార్డే.
- కెప్టెన్‌గా అర్ధసెంచరీల రికార్డూ విరాట్ పేరిటే ఉంది. లీగ్‌లో సారథిగా ఉండి 40 అర్ధసెంచరీలు చేశాడు.
- ఐపీఎల్‌లో 140 మ్యాచ్‌లకు సారథిగా వ్యవహరించాడు కోహ్లీ. ఇందులో 66 విజయాలు, 70 అపజయాలు ఉన్నాయి. నాలుగు మ్యాచ్‌ల ఫలితాలు తేలలేదు.
- కోహ్లీ సారథ్యంలో 2016లో ఆర్సీబీ ఫైనల్‌కు చేరింది.
- 2017, 2019 సీజన్లలో చివరిస్థానంలో నిలిచింది.
- ఐపీఎల్‌లో ఎక్కువ మ్యాచ్‌లకు కెప్టెన్‌గా చేసి ట్రోఫీ గెలవని ఆటగాడిగానూ కోహ్లీ చెత్త రికార్డు నెలకొల్పాడు. కెప్టెన్‌గా 140 మ్యాచ్‌లకు సారథ్యం వహించిన ఇతడు టైటిల్ గెలవలేకపోయాడు. కోహ్లీ తర్వాత వీరేంద్ర సెహ్వాగ్ (53), సచిన్ (51) ఉన్నారు.