ఐపీఎల్లో 6 వేల పరుగుల మైలురాయిని చేరుకున్నాడు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లీ. ఈ రికార్డు అందుకున్న తొలి బ్యాట్స్‌మన్‌గా ఘనత సాధించాడు. గురువారం రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఈ పరుగుల మైలురాయిని అందుకున్నాడు. కోహ్లీ తర్వాత రెండో స్థానంలో చెన్నై సూపర్‌కింగ్స్ బ్యాట్స్‌మన్ సురేశ్ రైనా (5448 పరుగులు) నిలిచాడు.
కింగ్ కోహ్లీ ఖాతాలో సరికొత్త రికార్డు - దేవ్‌దత్ పడిక్కల్ వార్తలు
ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) చరిత్రలో 6 వేల పరుగుల మైలురాయిని చేరుకున్న తొలి బ్యాట్స్‌మన్‌గా విరాట్ కోహ్లీ సరికొత్త రికార్డు సృష్టించాడు. టోర్నీలో అత్యధిక రన్స్ చేసిన జాబితాలో కోహ్లీ తర్వాత సీఎస్కే బ్యాట్స్‌మన్ సురేశ్ రైనా నిలిచాడు.
రాజస్థాన్ రాయల్స్ జట్టుపై ఘనవిజయం సాధించడం సహా.. దేవ్‌దత్ పడిక్కల్ సెంచరీ చేయడంపై తానెంతో ఆనందంగా ఉన్నట్లు మ్యాచ్ అనంతరం వెల్లడించాడు కోహ్లీ. "పడిక్కల్‌ది అద్భుతమైన ఇన్నింగ్స్. గత సీజన్లోనూ అతడు ఇలాగే ఆడాడు. ప్రతిసారీ ఆధిపత్యం ప్రదర్శిస్తూ ఆడలేం. ఒకరు బ్యాటింగ్ చేస్తున్నప్పుడు స్ట్రెయిక్ రొటేట్ చేయాలి. నేను చేసింది అదే. చివర్లో జోరు అందుకున్నా. నా షాట్లు ఆడా. పడిక్కల్ శతకానికి సమీపంగా ఉన్నప్పుడు మా మధ్య సంభాషణ జరిగింది. మ్యాచ్‌ను ముగించేయమని అతడు చెప్పాడు. కానీ, తొలి సెంచరీ చేశాక ఆ విషయం మాట్లాడాలని అతడితో చెప్పా. సెంచరీ సాధించేందుకు పడిక్కల్ అర్హుడు" అని కోహ్లీ అన్నాడు.
ఇదీ చూడండి..