vaibhav arora ipl career: మెగా టీ20 లీగ్ ఐపీఎల్లో భాగంగా ఆదివారం రాత్రి బ్రబౌర్న్ స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్‌లో చెన్నైపై 54 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది పంజాబ్. 181 పరుగుల లక్ష్య ఛేదనలో డిఫెండింగ్ ఛాంపియన్ సీఎస్కే ఏ దశలోనూ విజయం దిశగా సాగలేదు. చెన్నైని దెబ్బకొట్టి పంజాబ్‌కు విజయం అందించడంలో యువ పేసర్ వైభవ్ అరోరా కీలక పాత్ర పోషించాడు. దీంతో అరంగేట్రంలోనే అదరగొట్టిన అతడి గురించి క్రికెట్ అభిమానులు నెట్టింట్లో ఆరా తీయడం ప్రారంభించారు. ఇంతకి ఆ వైభవ్ అరోరా ఎవరంటే?
చెన్నై నడ్డి విరిచిన యువ పేసర్.. అరంగేట్రంలోనే అద్భుత ప్రదర్శన!
vaibhav arora ipl career: చెన్నైతో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ యువ పేసర్ వైభవ్ అరోరా అందరి దృష్టిని ఆకర్షించాడు. పవర్ ప్లేలోనే చెన్నై విధ్వంసకర బ్యాటర్లను పెవీలియన్‌కు పంపాడు. అరంగేట్రంలోనే అదరగొట్టిన అతడి గురించే ఈ కథనం..
ఐపీఎల్లో అపార అనుభవం ఉన్న సందీప్ శర్మ స్థానంలో జట్టులోకి వైభవ్‌ను ఎంపిక చేయటంపై పలువురు సందేహం వ్యక్తం చేశారు. అయితే.. ఐపీఎల్లో ఆడిన తొలి మ్యాచ్‌లోనే అద్భుత ప్రదర్శనతో తనను ఎంపిక చేయటం సరైనదేనని చాటిచెప్పాడు ఈ యువ పేసర్. పవర్ ప్లేలోనే విధ్వంసకర బ్యాటర్లు రాబిన్ ఉతప్ప, మెయిన్ అలీలను పెవీలియన్‌కు చేర్చి సీఎస్కే బ్యాటింగ్ లైనప్‌ను దెబ్బకొట్టాడు. మొత్తం నాలుగు ఓవర్లు వేసిన వైభవ్.. 21 పరుగులు ఇచ్చి 2 వికెట్లు తీశాడు.
- వైభవ్ అరోరా ప్రస్థానం:1997, డిసెంబర్ నాలుగున జన్మించాడు. ప్రస్తుతం అతనికి 24 ఏళ్లు
- దేశవాళీ క్రికెట్లో హిమాచల్‌ప్రదేశ్ తరఫున ఆడాడు అరోరా. ఫస్ట్‌క్లాస్‌లో తొలిసారి 2019లో సౌరాష్ట్రపై అరంగేట్రం చేశాడు.
- ఈ కుడిచేతి వాటం పేసర్ 2021లో ఛత్తీస్‌గఢ్‌పై టీ20ల్లో అరంగేట్రం చేశాడు
- గత ఐపీఎల్లో కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు వైభవన్ను తీసుకున్నా.. ప్లేయింగ్ 11లో అవకాశం దగ్గలేదు.
- ఇటీవల జరిగిన మెగా వేలంలో వైభవ్‌ను కనీస ధర రూ. 2కోట్లు పెట్టి సొతం చేసుకుంది పంజాబ్ కింగ్స్ జట్టు
- పంజాబ్ పేసర్ అర్షదీప్ సింగ్‌తో జూనియర్ స్థాయి నుంచి కలిసి ఆడుతున్నాడు వైభవ్. ఇరువురి మధ్య మంచి స్నేహబంధం ఉంది.
- ఆర్థిక సమస్యల కారణంగా వైభవ్ కొన్నాళ్ల క్రితం క్రికెట్‌ను వీడాడు. అయితే, తన చిన్ననాటి కోచ్ రవి వర్మ ప్రోత్సాహంతో మళ్లీ బాల్ అందుకున్నాడు.
ఇదీ చూడండి:CSKvsPBKS: మ్యాచ్ ఫలితంపై సీఎస్కే సారథి అలా.. పంజాబ్ కెప్టెన్ ఇలా!