విరాట్ కోహ్లీ కెప్టెన్‌గా ఉన్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు అభిమానం గణం చాలా ఎక్కువ! అందులో ప్రపంచ ప్రసిద్ధ రన్నర్ ఉసేన్ బోల్ట్ కూడా ఉన్నాడనే విషయం అందరికీ తెలిసిందే. అయితే త్వరలో కొత్త సీజన్ ప్రారంభం కానున్న సందర్భంగా ఆసక్తికర ట్వీట్ చేశాడు బోల్ట్. "ఛాలెంజర్స్ మీకు మరోసారి గుర్తుచేస్తున్నా.. ప్రపంచంలో అత్యంత వేగంగా పరుగెత్తే వాడిని నేనే" అంటూ రాసుకొచ్చాడు. దీంతో ఆర్సీబీ అభిమానుల సంతోషంలో మునిపోయారు. నం.1 అథ్లెట్ తమ జట్టుకు విషెస్ చెప్పాడంటూ కామెంట్లు పెడుతున్నారు.
ఆర్సీబీ జెర్సీలో పరుగుల వీరుడు ఉసేన్ బోల్ట్ - ipl latest news
ఐపీఎల్ సీజన్ ప్రారంభానికి ముందు ఆర్సీబీ అభిమానులకు కిక్ ఇచ్చే న్యూస్ ఇది. పరుగుల వీరుడు ఉసేన్ బోల్ట్ తమ అభిమాన జట్టు జెర్సీ వేసుకుని ఫొటో పెట్టడం, వారి ఆనందానికి అవధుల్లేకుండా చేసింది.
ఆర్సీబీ జెర్సీలో పరుగుల వీరుడు ఉసేన్ బోల్ట్
గత సీజన్ ప్లేఆఫ్స్ వరకు వచ్చిన ఆర్సీబీ.. ఈసారి ఎలాగైనా సరే కప్పు కొట్టాలనే ప్రణాళికతో బరిలోకి దిగుతోంది. విధ్వంసకర మ్యాక్స్‌వెల్ కూడా జట్టులోకి రావడం బెంగళూరుకు కలిసొచ్చే అంశంలా కనిపిస్తోంది. ప్రస్తుత సీజన్లో తన తొలి మ్యాచ్‌లో ముంబయి ఇండియన్స్‌తో తలపడనుంది కోహ్లీసేన.