శనివారం ముంబయి ఇండియన్స్, సన్రైజర్స్ మధ్య జరిగిన మ్యాచ్లో ఓ అనూహ్య ఘటన జరిగింది. ముంబయి పేసర్ ట్రెంట్ బౌల్డ్ అందరి దృష్టినీ ఆకట్టుకున్నాడు. బంతిని పట్టుకునేందుకు పాట్లు పడ్డాడు. ఏకంగా గాల్లో ఈత కొట్టినట్లు చేశాడు. ముంబయి విధించిన 150 పరుగుల లక్ష్యాన్ని.. వార్నర్ సేన ఛేదిస్తున్న క్రమంలో ఐదో ఓవర్లో ఈ ఘటన జరిగింది.
బంతిని పరుగెత్తి పట్టుకోవాలా? లేక బంతి కోసం జంప్ చేయాలా? అనే రెండు ఆలోచనలతో బౌల్ట్ ఈ జంప్ చేసిన సందర్భాన్ని నెటిజన్లు విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. అసలేమైందంటే.. బంతి కోసం వేగంగా పరుగెత్తిన బౌల్ట్ నియంత్రణ కోల్పోయి బంతిని ఆపలేక కిందపడ్డాడు.