ఐపీఎల్ 14వ సీజన్లో చాలా మ్యాచ్‌లు తక్కువ పరుగులకే ముగుస్తున్నాయి. పిచ్ స్లోగా ఉండటం, రాత్రి పూట తేమ వంటి కారణాల వల్ల రన్స్ సాధించడం కష్టంగా మారుతోంది అని అంటున్నారు క్రికెటర్లు. శుక్రవారం ముంబయి, పంజాబ్ మధ్య జరిగిన మ్యాచ్‌లో రోహిత్ సేన 131 పరుగులకే పరిమితమైంది. తాజాగా ఈ పిచ్‌లపై స్పందించాడు ఇంగ్లాండ్ ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్. ఈసారి లీగ్‌లో పిచ్‌లు చెత్తగా ఉన్నాయంటూ అసహనం వ్యక్తం చేశాడు.
ఐపీఎల్ పిచ్‌లు చెత్తగా ఉన్నాయి: స్టోక్స్
ప్రస్తుత ఐపీఎల్లో కొన్ని మ్యాచ్‌లు చాలా తక్కువ స్కోర్‌కే పరిమితమవుతున్నాయి. తాజాగా ఈ విషయంపై స్పందించాడు ఇంగ్లాండ్ ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్. పిచ్‌లు చాలా చెత్తగా ఉన్నాయంటూ ట్వీట్ చేశాడు.
"ఐపీఎల్ జరిగే కొద్ది పిచ్‌లు మరింత దారుణంగా తయారవ్వవని అనుకుంటున్నా. ఇలాంటి లీగ్‌లో 160/170 అనేది మినిమన్ స్కోర్. కానీ 130/140 పరుగులు అంటే పిచ్ బాగోలేదని అర్థం" అంటూ ట్వీట్ చేశాడు స్టోక్స్.
ప్రస్తుతం రెండు స్టేడియాల్లో మ్యాచ్‌లు జరుగుతున్నాయి. ముంబయిలోని వాంఖడేలో 200 పరుగుల్ని ఛేదించడం కూడా చాలా తేలికగా ఉండగా.. చెన్నై చెపాక్‌లో 150 పరుగులు చేయడం గగనంగా మారింది. దీంతో ఈ పిచ్‌పై చాలా వరకు విమర్శలు వస్తున్నాయి. ఐపీఎల్ లాంటి లీగ్‌ల కోసం ఇలాంటి పిచ్‌లు ఏంటి అంటూ పలువురు మండిపడుతున్నారు.