కరోనా కారణంగా ఆస్ట్రేలియా అగ్రశ్రేణి క్రికెటర్లు ఐపీఎల్‌కు దూరమవుతున్నారు. ఆ దేశ స్టార్ ఆటగాళ్లు డేవిడ్ వార్నర్, స్టీవ్ స్మిత్ కూడా టోర్నీని వీడనున్నారని సమాచారం. ఓ ఆస్ట్రేలియా మీడియా సంస్థ నివేదిక మేరకు త్వరలోనే వీరిద్దరూ స్వదేశానికి పయనంకానున్నారని తెలుస్తోంది.
భారత్ నుంచి వచ్చే విమానాలపై ఆస్ట్రేలియా నిషేధం విధించే అవకాశం ఉందన్న వార్తల నేపథ్యంలో అంతకుముందే ఇంటికి వెళ్లిపోవాలని వార్నర్, స్మిత్ భావిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే ఆర్సీబీ నుంచి ఆడమ్ జంపా, కేన్ రిచర్డ్‌సన్, రాజస్థాన్ రాయల్స్ ఆటగాడు ఆండ్రూ టై తమ స్వదేశమైన ఆస్ట్రేలియాకు వెళ్లిపోయారు.