చెన్నై సూపర్‌కింగ్స్‌తో బుధవారం జరిగిన మ్యాచ్‌లో తమ జట్టు ఓటమికి తాను పూర్తి బాధ్యత వహిస్తున్నట్లు సన్‌రైజర్స్ హైదరాబాద్ సారథి వార్నర్ తెలిపాడు. ఈ మ్యాచ్‌లో సీఎస్కే 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది.
"ఈ ఓటమికి నాదే పూర్తి బాధ్యత. నేనే నెమ్మదిగా బ్యాటింగ్ చేశా. మనీశ్ పాండే చాలా బాగా బ్యాటింగ్ చేశాడు. కేన్ విలియమ్సన్, కేదార్ జాదవ్ గౌరవప్రదమైన స్కోరును అందించారు. నేను బాదిన 15షాట్లు నేరుగా ఫీల్డర్ల్ చేతుల్లోకి వెళ్లడం వల్ల.. సింగిల్స్‌తో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. మొత్తంగా మ్యాచ్ ఓటమికి బాధ్యత తీసుకుంటున్నాను" అని వార్నర్ చెప్పాడు.