ఐపీఎల్లో కరోనా కలకలం రేపుతోంది. ఈ కారణంగానే పలువురు ఆటగాళ్లు లీగ్ నుంచి వీడుతున్నారు. ఇప్పుడు అగ్రశేణి జట్టు చెన్నై సూపర్ కింగ్స్‌లోనూ ముగ్గురికి వైరస్ సోకింది. ఫ్రాంచైజీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ కాశీ విశ్వనాథన్, బౌలింగ్ కోచ్ ఎల్ బాలాజీ, ఓ బస్ క్లీనర్ కొవిడ్ బారిన పడినట్లు తెలిసింది. మిగతా వారికి మాత్రం నెగటివ్‌గా తేలింది. ఆదివారం చేసిన పరీక్షల్లో ఈ ఫలితాలు వెల్లడయ్యాయి. అయితే వీరికి సోమవారం మరోసారి పరీక్షలు చేశారు. వీటికి సంబంధించిన ఫలితాలు రావాల్సి ఉంది. ఇందులో కూడా పాజిటివ్‌గా తేలితే వీరిని ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఐసోలేషన్లోకి పంపిస్తారు.
ఐపీఎల్: చెన్నై సూపర్‌కింగ్స్‌లో ముగ్గురికి కరోనా! - ipl 2021 corona cases
చెన్నై సూపర్‌కింగ్స్ జట్టులో ముగ్గురికి కరోనా సోకింది. వీరికి సోమవారం మరోసారి పరీక్ష చేశారు. ఇందులో కూడా పాజిటివ్ తేలితే వీరిని ఐసోలేషన్లోకి పంపిస్తారు.
సీఎస్కే
సోమవారం జరగాల్సిన మ్యాచ్‌కు ముందు చేసిన పరీక్షల్లోనూ కోల్‌కతా నైట్‌రైడర్స్ ఆటగాళ్లు వరుణ్ చక్రవర్తి, సందీప్ వారియర్‌కు కరోనా పాజిటివ్‌గా తేలింది. దీంతో ఆ జట్టుకు, ఆర్సీబీతో ఆడాల్సిన మ్యాచ్ వాయిదా పడింది.
ఇదీ చూడండి: కోల్‌కతా ఆటగాళ్లకు కరోనా.. బెంగళూరుతో మ్యాచ్ వాయిదా