కోల్‌కతాతో మ్యాచ్.. రోహిత్‌ను ఊరిస్తున్న రికార్డులు! - రోహిత్ శర్మ ఐపీఎల్ 2021 సిక్సులు
ఐపీఎల్(ipl 2021 live) రెండో విడతలో భాగంగా నేడు(సెప్టెంబర్ 23) ముంబయి ఇండియన్స్‌తో పోటీపడనుంది కోల్‌కతా నైట్‌రైడర్స్(mi vs kkr 2021). ఈ మ్యాచ్‌లో ముంబయి కెప్టెన్ రోహిత్(rohit sharma news)ను పలు రికార్డులు ఊరిస్తున్నాయి. అవేంటో చూద్దాం.
రోహిత్
ఐపీఎల్ రెండో దశను ఓటమితో ప్రారంభించిన ముంబయి ఇండియన్స్ నేడు (సెప్టెంబర్ 23) కోల్‌కతా నైట్‌రైడర్స్(mi vs kkr 2021)తో జరిగే మ్యాచ్‌లో ఎలాగైనా గెలవాలనే పట్టుదలతో ఉంది. అబుదాబి వేదికగా ఈ రెండు జట్లు పోటీపడనున్నాయి. చెన్నైతో జరిగిన మ్యాచ్‌కు దూరమైన ముంబయి కెప్టెన్ రోహిత్ శర్మ(rohit sharma news).. ఈ మ్యాచ్‌లో ఆడతాడని అభిమానులు భావిస్తున్నారు. ఒకవేళ ఈ మ్యాచ్‌లో హిట్‌మ్యాన్ ఆడితే.. అతడికి పలు రికార్డులు సాధించే అవకాశం ఉంది. అవేంటో చూద్దాం.
- కోల్‌కతాతో జరిగే మ్యాచ్‌లో రోహిత్(rohit sharma news) మరో 18 పరుగులు సాధిస్తే ఐపీఎల్లో ఓ ప్రత్యర్థి జట్టుపై 1000 పరుగులు సాధించిన తొలి క్రికెటర్లో చరిత్ర సృష్టిస్తాడు. ఇప్పటివరకు కోల్‌కతాపై ఇతడు 982 పరుగులు చేశాడు. సన్‌రైజర్స్ ఆటగాడు డేవిడ్ వార్నర్ పంజాబ్ కింగ్స్‌పై 943 పరుగులు సాధించి రెండో స్థానంలో ఉండగా, కోహ్లీ 909 (దిల్లీ క్యాపిటల్స్) పరుగులతో మూడో స్థానంలో కొనసాగుతున్నాడు.
- ఈ మ్యాచ్‌లో రోహిత్(rohit sharma news) మరో 4 సిక్సులు(rohit sharma six ipl) సాధిస్తే టీ20ల్లో 400 సిక్సులు బాదిన తొలి భారత ఆటగాడిగా రికార్డు సృష్టిస్తాడు . ప్రస్తుతం 397 సిక్సులతో ఉన్నాడు.
- ఈ మ్యాచ్ పవర్‌ప్లేలో మరో 2 సిక్సులు(rohit sharma six ipl) బాదితే ఐపీఎల్ పవర్‌ప్లేలో 50 సిక్సులు సాధించిన తొలి ముంబయి ఇండియన్స్ బ్యాట్స్‌మన్‌గా రోహిత్ (rohit sharma news) రికార్డు నెలకొల్పుతాడు.
- ఈ మ్యాచ్‌లో 4 ఫోర్లు బాదితే కోల్‌కతాపై 100 ఫోర్లు(rohit sharma ipl fours) కొట్టిన తొలి ఆటగాడిగా రోహిత్(rohit sharma news) రికార్డు కైవసం చేసుకుంటాడు.
- ప్రస్తుతం 5,480 పరుగులతో ఐపీఎల్లో అత్యధిక పరుగులు(rohit sharma ipl runs total) సాధించిన బ్యాట్స్‌మెన్ జాబితాలో నాలుగో స్థానంలో ఉన్నాడు రోహిత్ శర్మ(rohit sharma news). ఈ మ్యాచ్‌లో 16 పరుగులు సాధిస్తే చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాడు సురేశ్ రైనా (5,495)ను దాటి మూడో స్థానంలోకి వెళ్తాడు. కోహ్లీ (6081), ధావన్ (5619) తొలి రెండు స్థానాల్లో ఉన్నారు.