రాబోయే ఐపీఎల్ సీజన్లో హైదరాబాద్‌ను కూడా ఒక వేదికగా చేయండని రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖల మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. బీసీసీఐ, ఐపీఎల్ ఆఫీస్ బేరర్లను ట్యాగ్ చేస్తూ ట్విటర్ వేదికగా కోరారు.
హైదరాబాద్‌లో ఐపీఎల్ నిర్వహించండి : మంత్రి కేటీఆర్ - telangana it minister ktr
హైదరాబాద్ వేదికగా ఐపీఎల్ సీజన్‌ను నిర్వహించాలని రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖల మంత్రి కేటీఆర్ బీసీసీఐ, ఐపీఎల్ నిర్వాహకులను కోరారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి పూర్తి మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు.
భారత్‌లోని మెట్రో నగరాలన్నింటిలో.. హైదరాబాద్‌లోనే కొవిడ్ కేసులు తగ్గుముఖం పట్టాయన్న మంత్రి.. ఇది కరోనాపై రాష్ట్ర ప్రభుత్వ సమర్థవంతమైన చర్యలకు నిదర్శనమని పేర్కొన్నారు. తెలంగాణ సర్కార్ నుంచి పూర్తి మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు.
రాబోయే ఐపీఎల్ సీజన్ కోసం బీసీసీఐ ఆరు నగరాలను పరిశీలిస్తోంది. దిల్లీతోపాటు ముంబయి, కోల్‌కతా, బెంగళూరు, చెన్నై, అహ్మదాబాద్ ఉన్నాయి. బోర్డు పరిశీలనలో హైదరాబాద్ పేరు లేకపోవడం వల్ల ఇక్కడి పరిస్థితిని వివరిస్తూ కేటీఆర్ ట్వీట్ చేశారు.
- ఇదీ చూడండి :ఐపీఎల్: హైదరాబాద్ వాసులకు ఈసారీ నిరాశే!