తెలంగాణ

telangana

ETV Bharat / sports

ఐపీఎల్​లో ఆకట్టుకోలేకపోతున్న టీమ్​​ఇండియా ఆటగాళ్లు!

అక్టోబరులో టీ20 ప్రపంచకప్​ నేపథ్యంలో.. భారత ఆటగాళ్లకు ప్రస్తుత ఐపీఎల్​ కీలకంగా మారింది. ఈ టోర్నీలోని ప్రదర్శన బట్టే క్రికెటర్ల భవితవ్యం ఆధారపడి ఉంది. దీంతో ఇందులో సత్తా చాటి.. ప్రపంచకప్​లో చోటు కోసం పలువురు కుర్రాళ్లు ఆరాటపడుతుంటే, టీమ్ఇండియాలో స్థానం దక్కించుకున్న క్రికెటర్లు మాత్రం అంతగా రాణించలేకపోతున్నారు. వారెవరో తెలుసుకుందాం.

Team India capped players who have been struggling in IPL 2021
ఐపీఎల్​ 2021

By

Published : Apr 27, 2021, 10:01 AM IST

దేశవ్యాప్తంగా కొవిడ్​ కేసులు పెరుగుతున్నా.. ఇండియన్​ ప్రీమియర్​ లీగ్​(ఐపీఎల్​)లోని మొదటి 20 మ్యాచ్​లను భారత క్రికెట్​ నియంత్రణ మండలి(బీసీసీఐ) విజయవంతంగా నిర్వహించింది. ఈ టోర్నీ ద్వారా ఎంతోమంది యువ ఆటగాళ్లు టీమ్ఇండియాకు ఎంపికై రాణిస్తున్నారు. అయితే.. ఐపీఎల్​తో స్టార్లుగా ఎదిగిన కొందరు మాత్రం.. ప్రస్తుత సీజన్​లో రాణించడానికి కష్టపడుతున్నారు. గతంలోని ప్రదర్శనతో పోలిస్తే ప్రస్తుతం ఆ ఆటగాళ్ల ప్రదర్శన పట్ల క్రికెట్ అభిమానులు నిరాశగా ఉన్నారు. ఈ టోర్నీ ద్వారా జాతీయ జట్టులో చోటు దక్కించుకొని.. ప్రస్తుతం రాణించలేకపోతున్న ఆటగాళ్లెవరో తెలుసుకుందాం.

హార్దిక్​ పాండ్యా..

ఐపీఎల్​ ప్రస్తుత సీజన్​లో ముంబయి ఇండియన్స్ దారుణంగా విఫలమవుతోంది. తొలుత బ్యాటింగ్​ చేస్తూ.. ఇప్పటివరకు ఒక్కసారీ 160పైచిలుకు పరుగులు సాధించలేకపోయింది.​ దీనికి కారణం.. మిడిల్​ ఆర్డర్​లోని ఆల్​రౌండర్లు రాణించకపోవడమే! గతంలో ముంబయి జట్టులో.. అటు బ్యాటింగ్​తో పాటు బౌలింగ్​లోనూ కీలకంగా వ్యవహరించిన ఆటగాడు హార్దిక్​ పాండ్యా.

హార్దిక్​ పాండ్య

యూఏఈ వేదికగా గతేడాది జరిగిన సీజన్​లోనూ అద్భుతంగా రాణించి ప్రశంసలు అందుకున్నాడు. కానీ, ప్రస్తుత సీజన్​లో పేలవ ప్రదర్శన కనబరుస్తున్నాడు. ఈ ఐపీఎల్​లో ముంబయి ఆడిన 5 మ్యాచ్​ల్లో హార్దిక్​ పాండ్యా చేసిన పరుగులు వరుసగా 13, 15, 7, 0, 1. పాండ్యా తిరిగి ఫామ్​లోకి వస్తాడని ముంబయి ఆశాభావంతో ఉన్నప్పటికీ.. టీ20 వరల్డ్​కప్​ ముందు అతడి ప్రదర్శన ఆందోళన రేకెత్తించేదే.

యుజ్వేంద్ర చాహల్​..

ఇటీవలే ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్​లతో జరిగిన టీ20 సిరీస్​లో.. టీమ్​ఇండియా తుదిజట్టులో స్థానాన్ని కోల్పోయాడు ఒకప్పటి రెగ్యులర్​ ప్లేయర్​ యుజ్వేంద్ర చాహల్​. ప్రస్తుత ఐపీఎల్​లోనూ అతడి ప్రదర్శన అనుకున్నంతగా లేదు.

యుజ్వేంద్ర చాహల్​

రాయల్​ ఛాలెంజర్స్​ బెంగళూరు జట్టు ఆడిన మొదటి మ్యాచ్​తో పాటు కోల్​కతా నైట్​రైడర్స్​పైనా పేలవప్రదర్శన చేశాడు. మరోవైపు రాజస్థాన్​పై ఒక్క వికెట్టూ తీయలేదు. ఆదివారం చెన్నై సూపర్​కింగ్స్​తో జరిగిన మ్యాచ్​లో ఎట్టకేలకు వికెట్​ను సాధించాడు. అయితే ఈ సీజన్​లో మాత్రం గుర్తింపు తగ్గ ప్రదర్శన చాహల్​ నుంచి రాలేదు.

క్రునాల్ పాండ్యా..

హార్దిక్​ మాదిరిగానే క్రునాల్​ పాండ్యా కూడా ముంబయి ఇండియన్స్​లో కీలకమైన ఆటగాడిగా ఎదిగాడు. అవకాశం దొరికనప్పుడల్లా అటు బ్యాటింగ్​తో పాటు బౌలింగ్​లోనూ జట్టుకు అండగా నిలిచాడు. ఇటీవల జాతీయ జట్టుకూ ప్రాతినిధ్యం వహించాడు. అయితే ప్రస్తుత ఐపీఎల్​ సీజన్​లో మాత్రం పెద్దగా రాణించలేకపోతున్నాడు.

క్రునాల్​ పాండ్యా

టోర్నీలో ఇప్పటివరకు ఆడిన మ్యాచ్​ల్లో వరుసగా 7, 15, 3*, 1, 3 పరుగులతో సరిపెట్టుకోగా.. మూడు వికెట్లను మాత్రమే సాధించాడు. ముంబయి జట్టులో రెగ్యులర్​ ప్లేయర్​గా కొనసాగుతోన్న పాండ్యాను తప్పించేందుకు ఫ్రాంఛైజీ ఆసక్తి చూపకపోవచ్చు.

రవిచంద్రన్​ అశ్విన్​

కరోనా సంక్షోభం తర్వాత ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్​లతో జరిగిన టెస్టు సిరీస్​లో తనదైన మార్క్​తో గుర్తింపు పొందాడు టీమ్ఇండియా స్పిన్నర్​ రవిచంద్రన్​ అశ్విన్​. కానీ, ప్రస్తుత ఐపీఎల్​లో విఫలమయ్యాడు. పరుగులు నియంత్రించినప్పటికీ వికెట్లు తీయలేకపోయాడు. ఆడిన 5 మ్యాచ్​ల్లో ఒక వికెట్​ మాత్రమే సాధించగలిగాడు. కానీ, దిల్లీ క్యాపిటల్స్​ జట్టులోని మరో స్పిన్నర్​ అమిత్​ మిశ్రా ఆడిన మూడు మ్యాచ్​ల్లోనే 5 వికెట్లు తీయడం విశేషం.

అయితే.. తన కుటుంబం కరోనా బారిన పడిన కారణంగా ఐపీఎల్ నుంచి తాత్కాలికంగా వైదొలిగాడు అశ్విన్​.

రవిచంద్రన్​ అశ్విన్

ఇదీ చూడండి..కరోనా భయాలు- ఐపీఎల్​ను వీడుతున్న ఆసీస్​ క్రికెటర్లు!

ABOUT THE AUTHOR

...view details