తెలంగాణ

telangana

ETV Bharat / sports

'సూర్యకుమార్​ ఓ మేథమెటీషియన్‌.. ఆకాశం కూడా అతడికి హద్దు కాదు' - ముంబయి ఇండియన్స్​ సూర్యకుమార్​ యాదవ్​

Suryakumar Yadav IPL 2023 : టీ20 ప్రపంచ నెం.1 బ్యాటర్ సూర్యకుమార్​ యాదవ్ ప్రస్తుత ఐపీఎల్​ సీజన్​లో ఇరగదీస్తున్నాడు. ఎప్పటికప్పడు తనలోని కొత్తదనాన్ని ప్రేక్షకులకు పరిచయం చేస్తాడు సూర్య. అయితే ఈ క్రమంలో టీమ్​ఇండియా మాజీ బౌలర్​ శ్రీశాంత్​, సూర్యకుమార్​ పై ప్రశంసల జల్ల కురిపించాడు.

surya kumar yadav mi
surya kumar yadav

By

Published : May 5, 2023, 3:25 PM IST

Suryakumar Yadav IPL 2023: మిస్టర్​ 360గా పేరొంది అంతర్జాతీయ క్రికెట్​లో అంచెలంచెలుగా ఎదుగుతున్నాడు ముంబయి ఇండియన్స్​ ప్లేయర్ సూర్య కుమార్ యాదవ్. ఐపీఎల్​ సీజన్​ తొలి మ్యాచుల్లో పేలవ ప్రదర్శనను కనబరిచిన సూర్యకుమార్.. ఇప్పుడు మంచి ఫామ్​తో మెరుస్తున్నాడు. క్రీజులో దిగితే బౌండరీలతో చెలరేగిపోతున్నాడు. ఈ క్రమంలో సూర్యకుమార్​ను టీమ్​ఇండియా మాజీ బౌలర్​ శ్రీశాంత్​ ప్రశంసల వర్షం కురిపించాడు. సూర్య కుమార్​ను గణితశాస్త్రజ్ఞుడు అంటూ కొనియాడాడు.

"స్కై(సూర్య కుమార్​ యాదవ్) కేవలం ఒక బ్యాటర్​ కాదు. అతడు గణిత శాస్త్రజ్ఞుడు. బ్యాటింగ్ చేస్తున్నప్పుడు తనను తాను బ్యాలెన్స్​ చేసుకునే విధానం అమోఘం. సూర్య ఒక మ్యాథ్స్​ టీచర్​లాగా గ్రౌండ్​ను తనకు అనుకూలంగా విభజించుకొని.. సౌకర్యంగా ఆడతాడు. బౌలర్​ పేస్​ను చక్కగా ఉపయోగించుకుని కళ్లు చెదిరే సిక్సర్లు కొడతాడు. ఎక్కడ ఫీల్డర్​ ఉన్నాడో.. ఎక్కడ గ్యాప్​ ఉందో చూసి మరీ కచ్చితత్వంతో భారీ షాట్లు బాదుతాడు. సాధారణంగా ఆకాశమే హద్దు అంటారు. కానీ సూర్య కుమార్​కు ఆకాశం కూడా పరిమితి కాదు. ముంబయి ఇండియన్స్​ గెలుపు రుచి చూస్తే.. వారిని ఎవరూ ఆపలేరు' అంటూ పేర్కొన్నారు.

Surya Kumar Yadav Stats : ఇక ఈ ఐపీఎల్​ సీజన్​ మొదట్లో సూర్య తడబడినప్పటికీ మళ్లీ ​మునుపటి ఫామ్ అందుకున్నాడు. నిలకడతో రాణిస్తూ తన అద్భుతమైన బ్యాటింగ్​తో ఔరా అనిపిస్తున్నాడు. ముంబయి గత రెండు మ్యాచ్​ల్లో సక్సెస్​ఫుల్​గా 200+ టార్గెట్​లను చేజ్​ చేసింది. ఈ రెండింటిలోనూ సూర్య కమార్​ది కీలక పాత్ర. బ్యాక్​ టు బ్యాక్​ రెండు ఇన్నింగ్స్​ల్లో హాఫ్ సెంచరీలు నమోదు చేశాడు.​ మరోవైపు ఇదే ఐపీఎల్ సీజన్​లోనే సూర్య టీ20ల్లో 6000 వేల పరుగుల మైలురాయిని అందుకున్నాడు. అతి తక్కువ బంతుల్లోనే(4017) ఈ ఫీట్​ చేరుకున్న మొదటి భారత బ్యాటర్​గా నిలిచాడు. ఈ జాబితాలో సూర్య తర్వాతి స్థానంలో సురేశ్​ రైనా (4295 బంతుల్లో), కేఎల్​ రాహుల్​ (4342 బంతుల్లో) ఉన్నారు.

బౌలర్​ ఎవరైనా గ్రౌండ్​ నలువైపులా బౌండరీలు బాదగల నైపుణ్యాలు సూర్య సొంతం. తన వీరోచిత ఆట తీరుతో ముంబయి ఇండియన్స్​కు ఎన్నో అసాధ్యమైన విజయాలను సుసాధ్యం చేశాడు. బంతి ఎలా వచ్చినా దాన్ని స్టాండ్స్​లోకి పంపడమే లక్ష్యంగా టెక్నిక్​తో బాదుతాడు. ఆలస్యంగా అంతర్జాతీయ అరంగేట్రం చేసిన సూర్య.. ఊహించని రీతిలో టీ20ల్లో ఇప్పటికే మూడు సెంచరీలు నమోదు చేసి వరల్డ్​ నంబర్​-1 టీ20 బ్యాటర్​గా కొనసాగుతున్నాడు.

Mumbai Indians Squad 2023 : "ముంబయి ఇండియన్స్​కు బలమైన బ్యాటింగ్ లైనప్​ ఉంది. అదే వారి విజయాలకు తోడ్పడుతోంది. వికెట్​ కీపర్​ ఇషాన్​ కిషన్​ టచ్​లోకి రావటం ముంబయికి కసిసొచ్చే అంశం" అంటూ ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్​ టామ్​ మూడీ అన్నారు. కాగా ఐపీఎల్​ చరిత్రలోనే బ్యాక్​ టు బ్యాక్​ 200+ లక్ష్యాలను ఛేదించిన జట్టుగా ముంబయి ఇండియన్స్​ రికార్డు సృష్టించింది. మొదట రాజస్థాన్​ పై 213, తర్వాత పంజాబ్​ మీద 215 పరుగుల టార్గెట్​లను చేజ్​ చేసింది.

ABOUT THE AUTHOR

...view details