తెలంగాణ

telangana

ETV Bharat / sports

'జాన్ ​సీనా'లా మారిన స్టార్ క్రికెటర్.. వీడియో వైరల్ - సురేష్ రైనా వైరల్ వీడియో

చెన్నై సూపర్​ కింగ్స్ బ్యాట్స్​మన్ సురేష్​ రైనా(Suresh Raina) ఫుల్​ జోష్​లో ఉన్నాడు. తాజాగా ఇన్​స్టాగ్రామ్​ వేదికగా ఓ వీడియో పోస్ట్​ చేశాడు. ఈ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది.

suresh raina
సురేష్ రైనా

By

Published : Sep 1, 2021, 1:03 PM IST

Updated : Sep 1, 2021, 1:48 PM IST

చెన్నై సూపర్​ కింగ్స్(Chennai Super Kings) స్టార్ బ్యాట్స్​మన్ సురేష్ రైనా సోషల్​ మీడియాలోనూ యాక్టివ్​గా ఉంటాడు. తాజాగా తాను జాన్​ సీనాలా స్టంట్ చేసిన ఓ వీడియో ఇన్​స్టా గ్రామ్​లో పోస్ట్ చేశాడు. ఈ వీడియో నెట్టింట తెగ వైరల్​ అవుతోంది.

రైనా(Suresh Raina).. తన మిత్రుడు కేఎం ఆసిఫ్​తో కలిసి స్విమ్మింగ్​ ఫూల్​ దగ్గర కొన్ని డబ్ల్యూడబ్ల్యూఈ స్టంట్స్​ వేశాడు. ఈ వీడియోపై నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు.

సెప్టెంబర్​ 19న యూఏఈ వేదికగా ఐపీఎల్​ రెండో సీజన్(Ipl 2021) ప్రారంభం కానుంది. మొదటి మ్యాచ్​లో చెన్నై సూపర్​ కింగ్స్​, ముంబయి జట్టుతో(CSK vs MI) తలపడనుంది. ఐపీఎల్​ 2021లో సీఎస్కే తరఫున తొలి 7 మ్యాచ్​ల్లో ఆడిన రైనా.. 123 పరుగులు చేశాడు.

ఇదీ చదవండి:Ind Eng Test: విహారికి అవకాశం దక్కేనా?

Last Updated : Sep 1, 2021, 1:48 PM IST

ABOUT THE AUTHOR

...view details