తెలంగాణ

telangana

ETV Bharat / sports

'సామ్.. ఇంటికెళ్లి బుద్ధిగా చదువుకో' - 'సామ్.. ఇంటికెళ్లి బుద్ధిగా చదువుకో'

చెన్నై సూపర్ కింగ్స్ యువ పేసర్ సామ్ కరన్​కు సంబంధించిన ఓ మీమ్ నెట్టింట వైరల్​గా మారింది. ఇందులో సామ్​కు రైనా హితబోధ చేస్తున్నట్లు ఉంది.

Suresh Raina trolls Sam Curran
రైనా, సామ్

By

Published : May 7, 2021, 8:36 PM IST

ఐపీఎల్​లో చెన్నై సూపర్ కింగ్స్​ ఆటగాడు సామ్ కరన్​పై మీమ్స్, ట్రోల్స్ కొత్తేమీ కాదు. సీఎస్కే ప్రతి మ్యాచ్​కు ముందు అతడిపై మీమ్స్ సందడి చేస్తాయి. తాజాగా మరోసారి ఇతడిపై చేసిన ట్రోల్ నెట్టింట వైరల్​గా మారింది. ఇందులో సామ్ కరన్​కు సురేశ్ రైనా ఏదో హితబోధ చేస్తున్నట్లు ఉంది.

"చూడు సామ్.. లీగ్ అయిపోయాక ఇంటికెళ్లి చదువుకో. ఎవరైనా చాక్లెట్లు ఇస్తే తీసుకోకు".. అంటూ రైనా చెబుతుండగా.. సామ్ చిన్న పిల్లాడిగా తల ఊపడం కడుపుబ్బా నవ్విస్తోంది. ఈ ట్రోల్​కు రైనా స్పందిస్తూ లాఫింగ్ ఎమోజీలతో కామెంట్ పెట్టాడు. దీంతో ఈ ఫొటో నెట్టింట వైరల్​గా మారింది.

ఐపీఎల్​ 14వ సీజన్​లో ఆడిన 7 మ్యాచ్‌ల్లో 5 విజయాలతో పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో నిలిచింది చెన్నై. ఇందులో సామ్‌ ఆరు మ్యాచ్‌లాడి 9 వికెట్లు తీసి ఆకట్టుకున్నాడు.

ABOUT THE AUTHOR

...view details