ఆర్సీబీకి శాపంగా హైదరాబాద్.. ప్రతిసారి అడ్డంకే! - హైదరాబాద్ వర్సెస్ బెంగళూరు హెడ్ టూ హెడ్
ఐపీఎల్ 2021(IPL 2021 News)లో భాగంగా బుధవారం సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో ఓటమిపాలైంది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(RCB vs SRH 2021). అయితే ఇప్పటివరకు ఐపీఎల్ చరిత్రలో ఆర్సీబీ ప్రతిసారి హైదరాబాద్ చేతిలో కంగుతిని ప్లేఆఫ్స్ ఆశల్ని కోల్పోవడమో, టాప్-2 నుంచి వైదొలగడమో జరిగింది. ఆ వివరాలేంటో చూద్దాం.
ఐపీఎల్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(royal challengers bangalore team)కు ఏదైనా గట్టి పోటీ ఇచ్చే జట్టు ఉందంటే అది సన్‌రైజర్స్ హైదరాబాద్(sunrisers hyderabad team 2021) అని కచ్చితంగా చెప్పొచ్చు. ఎందుకంటే దశాబ్దకాలంపైగా ఆ జట్టు హైదరాబాద్ చేతిలో ఆఖరి నిమిషాల్లో ఓటమిపాలవుతోంది. దీంతో ప్లేఆఫ్స్‌లో చోటు కోల్పోవడం లేదా ప్లేఆఫ్స్‌లో తొలి రెండు స్థానాల్లో నిలవలేకపోవడం పరిపాటిగా మారింది. తొలుత దక్కన్ ఛార్జర్స్ టీమ్ రాయల్ ఛాలెంజర్స్‌పై ఆధిపత్యం చెలాయించగా తర్వాత సన్‌రైజర్స్ ఆ బాధ్యతలు స్వీకరించింది. దీంతో 2008 నుంచి హైదరాబాద్ ఫ్రాంఛైజీ బెంగళూరుకు కొరకరాని కొయ్యలా మారింది. ఆ వివరాలేంటో తెలుసుకుందాం.
- 2009లో దక్కన్ ఛార్జర్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(dc vs rcb 2009) ఫైనల్స్‌లో పోటీపడ్డాయి. అప్పుడు దక్కన్ ఛార్జర్స్ 6 పరుగుల తేడాతో విజయం సాధించి తొలిసారి బెంగళూరుకు షాకిచ్చింది.
- 2012 ఐపీఎల్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు లీగ్ దశలో తన చివరి మ్యాచ్‌లో దక్కన్ ఛార్జర్స్(dc vs rcb 2012)తో తలపడింది. ఆ మ్యాచ్‌లో డీసీ షాకివ్వడం వల్ల బెంగళూరు ఓటమిపాలైంది. దీంతో స్వల్ప నెట్‌రన్‌రేట్ తేడాతో చెన్నై సూపర్ కింగ్స్ నాలుగో స్థానంతో ప్లేఆఫ్స్‌కు దూసుకెళ్లింది.
- 2013 ఐపీఎల్‌లో తొలిసారి పోటీలోకి వచ్చిన సన్‌రైజర్స్ హైదరాబాద్ కూడా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(srh vs rcb 2013)కు షాకిచ్చింది. అప్పుడు లీగ్ దశలో ఎస్‌ఆర్‌హెచ్ తన చివరి మ్యాచ్‌లో రాజస్థాన్‌పై విజయం సాధించి బెంగళూరును ప్లేఆఫ్స్ చేరకుండా అడ్డుకుంది. నాలుగో స్థానంలో సన్‌రైజర్స్ ప్లేఆఫ్స్ చేరింది.
- 2015 ఐపీఎల్ లీగ్ దశలో సన్‌రైజర్స్ హైదరాబాద్(srh vs mi 2015).. ముంబయి ఇండియన్స్‌తో చివరి లీగ్ మ్యాచ్ ఆడింది. అప్పుడు ముంబయి విజయం సాధించడం వల్ల ప్లేఆఫ్స్‌లో బెంగళూరు టాప్ 2లో నిలిచే అవకాశం కోల్పోయింది.
- 2016 ఐపీఎల్ ఫైనల్స్‌లో రాయల్ ఛాలెంజర్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్(srh vs rcb 2016) తుదిపోరులో తలపడ్డాయి. ఆ మ్యాచ్‌లోనూ సన్‌రైజర్స్ విజేతగా నిలిచి బెంగళూరుకు రెండోసారి కప్పు దూరం చేసింది.
- 2020లో ప్లేఆఫ్స్‌లో మూడు, నాలుగు స్థానాల్లో నిలిచిన రెండు జట్లూ ఎలిమినేటర్ మ్యాచ్‌లో తలపడ్డాయి. ఇక్కడ కూడా సన్‌రైజర్స్ జట్టు బెంగళూరు(srh vs rcb 2020)ను ఓడించింది.
- ఇక ఇప్పుడు జరుగుతున్న 2021 సీజన్‌లోనూ బుధవారం జరిగిన 52వ మ్యాచ్‌లో బెంగళూరు, హైదరాబాద్(srh vs rcb 2021) జట్లు మరోసారి తలపడ్డాయి. ఇక్కడ కూడా సన్‌రైజర్స్ నాలుగు పరుగుల స్వల్ప తేడాతో విజయం సాధించి ప్లేఆఫ్స్‌లో కోహ్లీసేనను రెండో స్థానంలో నిలవనివ్వకుండా చేసింది.