కరోనా కట్టడికై భారత్ సాగిస్తున్న పోరులో భాగంగా సన్‌రైజర్స్ హైదరాబాద్ భారీ విరాళం ప్రకటించింది. తన వంతు సాయంగా రూ.30 కోట్లను కొవిడ్ రిలీఫ్ ఫండ్‌కు అందజేయనున్నట్లు ప్రకటించింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేపడుతున్న వివిధ కార్యక్రమాలకు ఈ విరాళాన్ని ఉపయోగించనున్నట్లు తెలిపింది. ఆక్సిజన్ సిలిండర్లు, మందుల పంపిణీ కోసం పలు స్వచ్ఛంద సంస్థలతో కలిసి పనిచేయనున్నట్లు తెలిపింది.
కరోనా కట్టడికై సన్‌రైజర్స్ హైదరాబాద్ భారీ విరాళం - sunriser hyderabad donation to covid relief fund
సన్‌రైజర్స్ హైదరాబాద్ కూడా కరోనా బాధితుల కోసం ముందుకొచ్చింది. ఆక్సిజన్, మందులు సరఫరా సహా కరోనా కట్టడికై ప్రభుత్వం చేపడుతున్న వివిధ కార్యక్రమాల కోసం రూ.30 కోట్లు విరాళంగా ప్రకటించింది.
సన్‌రైజర్స్
అంతకుముందు చెన్నై సూపర్ కింగ్స్ కూడా తమిళనాడు ప్రభుత్వానికి 450 ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లను వితరణ చేసింది. పలువురు క్రికెటర్లు కూడా తమ వంతుగా విరాళాలు ప్రకటిస్తున్నారు.
ఇదీ చూడండి: సీఎస్కే దాతృత్వం.. 450 ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లు వితరణ