తెలంగాణ

telangana

ETV Bharat / sports

ఐపీఎల్: హైదరాబాద్ రెండో ఓటమి - క్రికెట్ న్యూస్

బెంగళూరుతో సన్​రైజర్స్​ హైదరాబాద్​ ఈ సీజన్​లో రెండో ఓటమి మూటగట్టుకుంది. 6 పరుగుల తేడాతో బెంగళూరు విజయం సాధించింది.

SUNRISERS HYDERABAD BEAT ROYAL CHALLENGERS BANGALORE
ఐపీఎల్: బెంగళూరుపై హైదరాబాద్ విజయం

By

Published : Apr 14, 2021, 11:14 PM IST

Updated : Apr 14, 2021, 11:59 PM IST

సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌, రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు మధ్య జరిగిన మ్యచ్‌లో బెంగళూరు విజయం సాధించింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన కోహ్లి సేన 20 ఓవర్లలో ఎనిమిది వికెట్లు కోల్పోయి 149 పరుగులు చేసింది. ఓపెనర్‌ పడిక్కల్ (11) తొందరగా ఔటైనా.. మ్యాక్స్‌వెల్‌ (59) రాణించారు. విరాట్ కోహ్లి(33) ఫర్వాలేదనింపించారు. సన్‌రైజర్స్‌ బౌలర్లలో హోల్డర్‌ 3, రషీద్‌ ఖాన్‌ 2, నదీమ్‌, భువనేశ్వర్‌, నటరాజన్‌ తలో వికెట్‌ తీశారు.

150 పరుగుల స్వల్ప ఛేదనకు దిగిన హైదరాబాద్‌..ఆదిలోనే వృద్ధిమాన్ సాహా(1) వికెట్‌ను కోల్పోయింది. మరో ఓపెనర్‌ డేవిడ్‌ వార్నర్ (37 బంతుల్లో 57 పరుగులు) మనీశ్ పాండే(39 బంతుల్లో 38 పరుగులు) తో కలిసి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దాడు. వీరిద్దరూ క్రీజులో ఉన్నంత వరకు నిలకడగా పరుగులు చేయడంతో అందరూ హైదరాబాద్ గెలుపు ఖాయం అనుకున్నారు. వీరిద్దరూ ఔటైన తర్వాత వచ్చిన బ్యాట్స్‌మెన్.. బెంగళూరు బౌలర్ల ధాటికి హైదరాబాద్‌ స్వల్ప వ్యవధిలోనే 6 వికెట్లు కోల్పోయింది. హైదరాబాద్ చివరి ఓవర్‌లో 16 పరుగులు చేయాల్సిన స్థితిలో నిలిచింది. ఈ ఓవర్‌లో సన్‌రైజర్స్‌ 9 పరుగులే చేయడం వల్ల బెంగళూరు 6 పరుగుల తేడాతో విజయం సాధించింది. బెంగళూరు బౌలర్లలో షాబాజ్‌ అహ్మద్‌ 2 ఓవర్లలో 3 వికెట్లు తీసి ఆకట్టుకున్నాడు. హర్షల్‌ పటేల్‌ 2, సిరాజ్‌ 2, జేమీసన్‌ 1 వికెట్‌ పడగొట్టారు.

Last Updated : Apr 14, 2021, 11:59 PM IST

ABOUT THE AUTHOR

...view details