Shoaib Akhtar: 2008 టీ20 లీగ్ ఆరంభ సీజన్‌లో క్రికెట్ దిగ్గజం సచిన్ తెందూల్కర్‌ను ముంబయిలో ఔట్ చేయడం తాను చేసిన పెద్ద తప్పు అని పాకిస్థాన్ మాజీ పేసర్ షోయబ్ అక్తర్ పేర్కొన్నాడు. అలా చేయడం వల్ల తాను తీవ్ర మాటలు ఎదుర్కోవాల్సి వచ్చిందని చెప్పాడు. ఇటీవలే ఓ క్రీడా ఛానెల్‌తో మాట్లాడిన అక్తర్.. నాటి లీగ్‌లో కోల్‌కతా బౌలర్‌గా వాంఖడేలో ముంబయితో జరిగిన మ్యాచ్‌లో తొలి ఓవర్‌లోనే సచిన్‌ను ఔట్ చేశానన్నాడు.
"ఆ రోజు వాంఖడే మొత్తం అభిమానులతో నిండిపోయి కళకళలాడుతోంది. అయితే, నేను తొలి ఓవర్‌లోనే సచిన్‌ను ఔట్ చేయడం వల్ల వారందరికీ కోపం వచ్చింది. ఆరోజు నేను చేసిన పెద్ద తప్పు అదే. తర్వాత మ్యాచ్ జరుగుతున్నప్పుడు ఫైన్‌లెగ్‌లో నేను ఫీల్డింగ్ చేస్తుండగా ప్రేక్షకుల నుంచి పరుష పదాలు వినిపించాయి. అప్పుడు గంగూలీ నా వద్దకు వచ్చి.. 'మిడ్ వికెట్‌కు రా.. ఎవరు నిన్ను సచిన్‌ను ఔట్ చేయమన్నారు? అది కూడా ముంబయిలో. వాళ్లు నిన్ను చంపేస్తారు' అని అన్నాడు" అని అక్తర్ నాటి సంగతుల్ని గుర్తుచేసుకున్నాడు.