రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్గా విరాట్ కోహ్లీ చివరి మ్యాచ్ ఆడిన నేపథ్యంలో ఆ జట్టు బ్యాట్స్మన్ (ab de villiers on kohli) ఏబీ డివిలియర్స్ స్పందించాడు. కోహ్లీ కెప్టెన్సీపై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు. దీనికి సంబంధించిన (ab de villiers vs kohli) వీడియోను సామాజిక మాధ్యమాల్లో పంచుకుంది ఆర్సీబీ జట్టు.
"కెప్టెన్గా కోహ్లీ అనగానే గొప్పతనం అనే మాట గుర్తొస్తుంది. అతడు కెప్టెన్గా జట్టును ముందుండి నడిపించిన తీరు ప్రతి ఒక్కరిలో స్ఫూర్తిని నింపింది. ఇది ట్రోఫీని సాధించిన దానికన్నా చాలా ఎక్కువ. కోహ్లీ గొప్పగా ప్రయత్నించాడు. ఇంకా ఈ ఆట ముగియలేదు. నువ్వు మాకోసం చేసిందేది మేం మర్చిపోం. ఈ జ్ఞాపకాలను ఇచ్చినందుకు ధన్యవాదాలు."