తెలంగాణ

telangana

ETV Bharat / sports

శుభ్​మన్​ సోదరిని టార్గెట్​ చేసిన నెటిజన్లు​.. RCB ఓడిందని విద్వేష కామెంట్లు! - శుభ్​మన్​గిల్​ సోదరి

ఆదివారం ఆర్సీబీతో జరిగిన మ్యాచ్​ను వీక్షించేందుకు శుభ్​మన్​ సోదరి స్టేడియానికి వచ్చారు. మ్యాచ్​ అనంతరం ఆ ఫొటోలను ఇన్​స్టాలో షేర్​ చేశారు. అయితే కొంత మంది ఫ్యాన్స్​ ఆమెను టార్గెట్​ చేస్తూ వ్యతిరేక కామెంట్లు పెట్టారు. ఇంతకీ ఏం జరిగిందంటే..

shubman gill sister shahneel abused on social media
shubman gill sister shahneel abused on social media

By

Published : May 22, 2023, 10:52 AM IST

Updated : May 22, 2023, 12:58 PM IST

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2023లో భాగంగా ఆదివారం జరిగిన మ్యాచ్​లో గుజరాత్ టైటాన్స్ ఓపెనింగ్ బ్యాటర్ శుభ్‌మన్ గిల్ తన ఫామ్​ను కొనసాగిస్తూ చెలరేగిపోయాడు. దీంతో ఆర్సీబీతో జరిగిన పోరులో గుజరాత్​దే పైచేయిగా నిలిచింది. ప్లేఆఫ్స్​పై ఆశలు పెట్టుకున్న బెంగళూరు జట్టు నిరాశతో వెనుతిరిగింది. ఇక సోషల్​ మీడియా వేదికగా కొందరు ఫ్యాన్స్​.. ఈ మ్యాచ్​ విషయంపై రకరకాలుగా కామెంట్లు చేయడం మొదలు పెట్టారు. ఆర్సీబీ జట్టుకు సపోర్ట్​ చేసే కొంతమంది అభిమానులు మాత్రం హద్దులు దాటి ఏకంగా గుజరాత్​ టీమ్​ ప్లేయర్​ శుభమన్​ గిల్​ సోదరి షహనీల్​గిల్​ను టార్గెట్​ చేశారు. ఆమె పెట్టిన ఇన్​స్టా పోస్ట్​ను ట్రోల్​ చేస్తూ కామెంట్లు పెట్టారు.

ఆదివారం జరిగిన మ్యాచ్​ను వీక్షించేందుకు శుభ్​మన్​ సోదరి స్టేడియానికి వచ్చారు. స్టాండ్​లో తన స్నేహితులతో కలిసి గుజరాత్​ జట్టుకు సపోర్ట్​ చేశారు. ఈ క్రమంలో ఆమె తన ఫొటోలను కొన్నింటిని ఇన్​స్టాలో షేర్​ చేశారు. "వాట్ ఎ హోల్‌సమ్ డే" అంటూ క్యాప్షన్​ జోడించారు.

అయితే ఈ పోస్ట్​పై కొంత మంది అభిమానులు షహనీల్​తో పాటు శుభ్​మన్​ గురించి ద్వేషపూరిత కామెంట్లు పెట్టారు. అయితే ఈ కామెంట్లు చూసిన మరో వర్గం ఫ్యాన్స్​.. సోషల్​ మీడియా వేదికగా ఇలాంటి విద్వేషపూరిత కామెంట్లు పెట్టినవారిని తిట్టిపోస్తున్నారు. మ్యాచ్​ అన్నాక గెలుపోటములు సహజమని దాని కోసం ప్రత్యర్థి జట్ల ప్లేయర్ల కుటుంబసభ్యలను ఇలా టార్గెట్​ చేయడం సమంజసం కాదని అంటున్నారు. మరోవైరు ఇదే విషయంపై విరాట్​ గిల్​ ఫ్యాన్స్​ మధ్యలో నెట్టింట పెద్ద​ వార్​ సైతం నడుస్తోంది.

" ఈ రోజు శుభ్‌మన్‌ గిల్, అతడి సోదరిపై ట్వీట్లు పెడుతున్న వారిని ఓ సారి గమనించండి. తమ కుమార్తె వామికాను ఓ ఐఐటీ గ్రాడ్యుయేట్‌ అత్యాచారం బెదిరింపులు చేసినా కూడా విరాట్-అనుష్కలు క్షమించి వదిలేయమని అతడిపై జాలి చూపించారు. అసలు అటువంటి వాడిని జైలుకు పంపించి కెరీర్‌ను ముగించాల్సింది. దాని ద్వారా ఇలాంటి పనులు మరొకరు చేయకుండా అతడో ఉదాహరణగా మారేవాడు" అని ఓ అభిమాని చేశాడు.

దానికి ప్రతిగా... "కొందరు కోహ్లీ అభిమానులు గిల్​తో పాటు అతని కుటుంబ సభ్యులను అవమానించేలా పోస్టులు పెట్టారు. ఇలాంటి నెగిటివ్‌ ఎనర్జీ, విష ప్రచారంతో విరాట్ అభిమానులుగా ప్రకటించుకొనే కొందరి వల్లే కింగ్‌ కోహ్లీకు ఇబ్బందులు. ఎవరు ఎంత ఏడ్చినా సరే గిల్ భారత క్రికెట్‌కు భవిష్యత్తు సూపర్‌స్టార్" అని మరో అభిమాని ఘాటుగా స్పందించాడు.

"నేను విరాట్‌కు పెద్ద ఫ్యాన్‌ను. అయితే, గిల్ అద్భుతంగా ఆడాడు. గిల్ ఫ్యామిలీ విమర్శించే వారు నిజమైన విరాట్ కోహ్లీ అభిమానులు కాలేరు" అంటూ మరో ఫ్యాన్ ట్వీట్​ చేశారు.

Last Updated : May 22, 2023, 12:58 PM IST

ABOUT THE AUTHOR

...view details