టీమ్ఇండియా బ్యాట్స్మన్ శ్రేయస్ అయ్యర్.. ఈ ఏడాది టీ20 ప్రపంచకప్ జరిగే సమయానికి పూర్తి ఫిట్నెస్ సాధించాలని ప్రయత్నిస్తున్నాడు. ప్రస్తుతం తాను కోలుకునే పనిలోనే ఉన్నట్లు ఓ వీడియో పోస్ట్ చేశాడు. అయితే అతడు పూర్తిగా కోలుకోవడానికి మరో మూడు నెలలు పట్టొచ్చని అతడి ప్రతినిధి ఒకరు చెప్పారు. సెప్టెంబరు నాటికి శ్రేయస్ ఫిట్నెస్ సాధిస్తాడని అన్నారు. కరోనా నిబంధనల వల్ల అతడికి అందించాల్సిన చికిత్స ఆలస్యమైందని తెలిపారు.
"చికిత్స కోసం శ్రేయస్ అయ్యర్, జాతీయ క్రికెట్ అకాడమీకి వెళ్లాడు. కానీ కర్ణాటకలో కరోనా కేసులు పెరుగుతున్న కారణంగా అతడికి అందించాల్సిన చికిత్స ప్రక్రియ ఆలస్యమైంది. దీంతో ముంబయిలోనే బీసీసీఐ మెడికల్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలోని ఓ కన్స్ల్టెంట్ వద్ద చికిత్స తీసుకుంటున్నాడు. సెప్టెంబరు నాటికి కోలుకుంటాడు. నిరవధిక వాయిదా పడిన ఐపీఎల్లోని మిగతా మ్యాచ్లు జరిపితే వాటిలో ఆడతాడు"