Shoaib Akhtar on Virat Kohli: బెంగళూరు మాజీ సారథి విరాట్ కోహ్లీ గత కొన్నేళ్లుగా తన స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోతున్నాడు. అటు అంతర్జాతీయ క్రికెట్‌తో పాటు ఇటు ఈ టీ20 టోర్నీలోనూ భారీ ఇన్నింగ్స్ ఆడలేకపోతున్నాడు. ఇటీవలే దిల్లీతో జరిగిన మ్యాచ్‌లో అతడు 12 పరుగులకే రనౌటవ్వడం వల్ల పాకిస్థాన్ మాజీ పేసర్ షోయబ్ అక్తర్ స్పందించాడు. ఓ క్రీడా ఛానల్‌తో మాట్లాడుతూ విరాట్‌కు ఓ సూచన చేశాడు.
కోహ్లీ.. నువ్వో సాధారణ ఆటగాడివనే అనుకో..: అక్తర్
Shoaib Akhtar on Virat Kohli: అంతర్జాతీయ క్రికెట్ సహా ఐపీఎల్‌లోనూ భారీ స్కోర్లు చేయలేకపోతున్నాడు స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ. ఈ నేపథ్యంలోనే పరుగులు చేయకపోతే ఎవరినీ ఉపేక్షించరాదని అన్నాడు పాక్ మాజీ క్రికెటర్ షోయబ్ అక్తర్. కోహ్లీ తనను తాను ఓ సాధారణ ఆటగాడిగా భావించాలని సూచించాడు
"పరుగులు చేయకపోతే ఎవరినీ ఉపేక్షించేది లేదు. అందుకు కోహ్లీ మినహాయింపేమీ కాదు. అతడు సరిగ్గా ఆడకపోతే పక్కకు పెట్టొచ్చు. అతడి విషయంలో కొన్ని విషయాలు నేను ఇప్పుడు చెప్పదల్చుకోలేదు. ప్రస్తుతం అతడి బుర్రలో ఎన్నో ఆలోచనలు తిరుగుతుండొచ్చు. అతడో మంచి వ్యక్తి, మంచి ఆటగాడే కాకుండా అతిగొప్ప క్రికెటర్. అయితే, అతడిని నేను ఒక్కటే చెప్పదల్చుకున్నా. తన మదిలో ఏం అనుకుంటున్నాడో అవన్నీ కాకుండా కేవలం ఒకే విషయం మీద ధ్యాసపెట్టాలని సూచిస్తున్నా. ఎవరు ఏమనుకుంటున్నారనేది వదిలేసి తనని తాను ఒక సాధారణ ఆటగాడిగా భావించాలి. బ్యాట్ తీసుకొని దంచికొట్టడమే పనిగా పెట్టుకోవాలి" అని అక్తర్ తన అభిప్రాయాలు వెల్లడించాడు.
ఇదీ చూడండి:'కోహ్లీ ఒక సూపర్‌హ్యూమన్.. ఆ జాబితాలో అతడే నెం.1'