తెలంగాణ

telangana

ETV Bharat / sports

మరీ ఇలా కూడా అవుటవుతారా.. గుజరాత్​ బ్యాటర్​పై నెటిజన్ల ట్రోల్స్​! - టాటా ఐపీఎల్​

Sai Sudarshan hit wicket: ముంబయి ఇండియన్స్​తో శుక్రవారం జరిగిన మ్యాచ్​లో గుజరాత్​ అటగాడు సాయి సుదర్శన్​ ఔటైన తీరుపై నెటిజన్లు ట్రోల్స్​ చేస్తున్నారు. ఇలా కూడా అవుటవుతారా అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఈ మ్యాచ్​లో గుజరాత్​ టైటాన్స్ వరుస వికెట్లు కోల్పోయి​ పరాజయం పాలైంది.

Sai Sudarshan hit wicket
సాయి సుదర్శన్​

By

Published : May 7, 2022, 10:39 AM IST

Sai Sudarshan hit wicket: ఐపీఎల్​ మెగా టీ20 లీగ్​ 15వ సీజన్​ ఉత్కంఠభరితంగా సాగుతోంది. అద్భుత క్యాచ్​లు, కళ్లు చెదిరే ఫీల్డింగ్​ విన్యాసాలే కాదు.. కొన్ని వింతలు సైతం చోటు చేసుకుంటున్నాయి. ముంబయి ఇండియన్స్​తో శుక్రవారం జరిగిన మ్యాచ్​లో గుజరాత్​ టైటాన్స్​ బ్యాటర్​ సాయి సుదర్శన్​ వినూత్న రీతిలో ఔటయ్యాడు. ఇలా ఒక ఆటగాడు తన వికెట్​ను సమర్పించుకోవటం క్రికెట్​లో అరుదుగా జరుగుతుంటుంది. ఉత్కంఠగా సాగుతున్న మ్యాచ్​లో కీలక సమయంలో హిట్​ వికెట్​గా వెనుదిరిగాడు సాయి. దీంతో ఇలా కూడా అవుటవుతారా అంటూ నెటిజన్లు ట్రోల్స్​ చేస్తున్నారు.

శుక్రవారం జరిగిన మ్యాచ్​లో ముంబయి చేతిలో గుజరాత్​ టైటాన్స్​ పరాజయం పాలైంది. ముంబయి నిర్దేశించిన 178 పరుగుల లక్ష్యాన్ని సులభంగా ఛేదించే దశ నుంచి వరుసగా వికెట్లు సమర్పించుకుని 5 పరుగుల దూరంలో నిలిచిపోయింది టైటాన్స్​. ఓపెనర్లు వృద్ధిమాన్ సాహా(55), శుభమన్​ గిల్(52)​ పోరాటం వృథాగా పోయింది. 14 పరుగుల వ్యక్తిగత స్కోర్​ వద్ద గుజరాత్​ బ్యాటర్​ సాయి సుదర్శన్​ హిట్​ వికెట్​ రూపంలో ఔటయ్యాడు. ముంబయి ఇండియన్స్​ ఆల్​ రౌండర్​ కీరన్​ పొలార్డ్​ 16వ ఓవర్​ వేయగా.. చివరి బంతిని పుల్​ షాట్​ ఆడే క్రమంలో నియంత్రణ కోల్పోయిన సుదర్శన్​ వెనక్కి తిరిగి తన బ్యాట్​తో వికెట్లను గిరాటేశాడు. దాంతో హిట్​ వికెట్​గా పెవిలియన్​ బాట పట్టాడు. మ్యాచ్​ సమయంలో సాయి సుదర్శన్​కు అవతలి ఎండ్​లో ఉన్న హార్దిక్​ పాండ్యా సైతం 2020 సీజన్​లో ఇలాగే హిట్​ వికెట్​ అయ్యాడు. ​

ఐపీఎల్​ 2022 సీజన్​లో సాయి సుదర్శన్​ తొలి హిట్​ వికెట్​ కావటం విశేషం. అయితే.. ఐపీఎల్​ చరిత్రలో హిట్​ వికెట్​ రూపంలో ఔట్​ కావటం పలు సందర్భాల్లో జరిగింది. గతంలో సన్​రైజర్స్​ హైదరాబాద్​ ఆటగాడు జానీ బెయిర్​స్టో(2021), రషీద్​ ఖాన్​(2020), రియాన్​ పరాగ్​(2019) ఇలాగే అవుటయ్యారు.

ఇదీ చూడండి:కఠిక పేదరికం.. కడుపు నిండా తిండి లేని దైన్యం.. కల మాత్రం ఒక్కటే

గుజరాత్​కు షాక్.. ఉత్కంఠ పోరులో ముంబయిదే విజయం

ABOUT THE AUTHOR

...view details