సన్‌రైజర్స్ హైదరాబాద్ తురుపు ముక్క.. రషీద్ ఖాన్. తన మిస్టరీ స్పిన్‌తో ఎంతో మంది బ్యాట్స్‌మన్లను ముప్పుతిప్పలు పెట్టాడు. జట్టుకు విజయాలు అందించాడు. అందుకే అలవోకగా పరుగులు చేసే ఎంతటి బ్యాట్స్‌మన్ అయినా అతడికి భయపడుతుంటారు. అతడు బౌలింగ్‌కు వచ్చాడంటే ఆచితూచి ఆడతారు. వెస్టిండీస్ విధ్వంసకర వీరుడు, కోల్‌కతా నైట్‌రైడర్స్ ఆటగాడు ఆండ్రూ రస్సెల్ సైతం ఇదే కోవలోకి వస్తాడు.
రషీద్ బౌలింగ్‌లో రస్సెల్‌కు మెరుగైన రికార్డు లేదు. సిక్సర్లు బాదకుండా ఎవరినీ వదిలిపెట్టని అతడు ఈ అఫ్గాన్ వీరుడు వస్తే మాత్రం వణికిపోతాడు! ఎందుకంటే హైదరాబాద్‌తో ఆదివారం జరిగిన మ్యాచ్‌కు ముందు టీ20 క్రికెట్లో అతడిని రషీద్ మూడుసార్లు ఔట్ చేశాడు. కేవలం 28 బంతులు విసిరి 48 పరుగులే ఇచ్చాడు. ఈ మ్యాచ్‌లో 7, 9, 13 ఓవర్లు వేసిన అతడికి కాసేపటి వరకు బంతినివ్వలేదు కెప్టెన్ వార్నర్.