సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టులో బ్యాట్స్‌మన్‌గానూ డేవిడ్ వార్నర్‌కు చోటు దక్కకపోవడం ఆశ్చర్యం కలిగించిందని టీమ్‌ఇండియా మాజీ క్రికెటర్ దీప్‌దాస్ గుప్తా అన్నాడు. ప్రపంచంలోని అత్యుత్తమ సారథుల్లో ఒకడైన విలియమ్సన్‌కు నాయకత్వం అప్పగించడంలో అర్థముందని పేర్కొన్నాడు. అయితే, ఆటగాడిగానూ వార్నర్‌ను తీసుకోకపోవడం అర్థరహితంగా అనిపించిందన్నాడు. ఆ జట్టులో ఇబ్బందులు ఉన్నాయని వెల్లడించాడు.
'వార్నర్‌ను ఆడించకపోవడం ఆశ్చర్యకరం'
సన్‌రైజర్స్ హైదరాబాద్ మాజీ సారథి వార్నర్‌ను కనీసం ఆటగాడిగానైనా జట్టులోకి తీసుకోకపోవడం ఆశ్చర్యాన్ని కలిగించిందని అన్నాడు టీమ్‌ఇండియా మాజీ క్రికెటర్ దీప్‌దాస్ గుప్తా. అతడిని ఆడించకపోవడం అర్థరహితమని చెప్పాడు.
"టోర్నీకి ముందు సన్‌రైజర్స్ నా టాప్-4 జట్లలో ఒకటి. కానీ, వాళ్లు అంచనాలు అందుకోవడం లేదు. నిజమే భువీ, నటరాజన్ గాయపడ్డారు. వార్నర్ సరైన ఫామ్‌లో లేడు. కానీ వారి నిర్ణయాలు కొన్ని అర్థరహితంగా ఉంటున్నాయి. తుది జట్టులో వార్నర్ లేకపోవడం ఆశ్చర్యం కలిగించింది. గొప్ప నాయకుడు కాబట్టి సారథ్యాన్ని విలియమ్సన్‌కు బదిలీ చేశారు. కనీసం ఆటగాడిగా వార్నర్ లేకపోవడం ఆశ్చర్యమే. అతడికి చోటివ్వకపోవడం దురదృష్టకరం, అన్యాయం. మరోపక్క అతడి స్థానంలో ఆడిన వారిని ఒక్క మ్యాచుతోనే నిర్ణయించకూడదు. తగినన్ని అవకాశాలు ఇవ్వాలి. ఏదేమైనప్పటికీ హైదరాబాద్ జట్టులో స్థిరత్వం కనిపించడం లేదు. వాళ్లు చాలామందిని ఆడించారు. వివిధ కూర్పులను ప్రయత్నించారు. ఏవీ పనిచేస్తున్నట్టు అనిపించడం లేదు. 23 మందిలో 21 మందిని ప్రయత్నించారంటేనే డ్రస్సింగ్ రూమ్ వాతావరణం గురించి అర్థం చేసుకోవచ్చు" అని దాస్ అన్నాడు.
ఇదీ చూడండి: 'వార్నర్ ప్రపంచ స్థాయి ఆటగాడు.. త్వరలోనే జట్టులోకి..'