టాస్ గెలిచి (IPL 2021) బ్యాటింగ్‌కి దిగిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB vs PBKS) నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 164 పరుగులు చేసింది. గ్లెన్ మ్యాక్స్‌వెల్ (57) అర్ధ శతకంతో ఆకట్టుకున్నాడు. దీంతో ప్రత్యర్థి జట్టు ముందు 165 పరుగుల లక్ష్యాన్ని (IPL 2021 Live Score) ఉంచింది ఆర్సీబీ.
RCB vs PBKS: రాణించిన మ్యాక్స్‌వెల్.. పంజాబ్ లక్ష్యం 165 - ipl 2021
ఐపీఎల్ రెండో దశలో(IPL 2021) భాగంగా ఆదివారం(అక్టోబర్ 3) పంజాబ్ కింగ్స్‌తో జరుగుతోన్న మ్యాచ్‌లో (RCB vs PBKS) ఆర్సీబీ బ్యాట్స్‌మన్ మ్యాక్స్‌వెల్ హాఫ్ సెంచరీతో మెరిశాడు. దీంతో పంజాబ్ ముందు 165 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది బెంగళూరు.
RCB vs PBKS
బెంగళూరు ఓపెనర్లు దేవ్‌దత్ పడిక్కల్ (40), విరాట్ కోహ్లీ (25) శుభారంభం చేశారు (PBKS vs RCB Match). డివిలియర్స్ (23) ఫర్వాలేదనిపించాడు. షాబాజ్ అహ్మద్ (8) ఆకట్టుకోలేకపోయాడు. డేనియల్ క్రిస్టియన్ (0), జార్జ్ గార్టన్ (0) డకౌటయ్యారు. పంజాబ్ బౌలర్లలో హెన్రిక్స్ మూడు, మహమ్మద్ షమి మూడు వికెట్లు తీశారు.
ఇదీ చూడండి:'బంతికోసం ఫిలిప్స్ పరుగులు.. ఆశ్చర్యపోయిన సామ్'
Last Updated : Oct 3, 2021, 5:48 PM IST