ప్లే ఆఫ్స్(rajasthan royals mumbai match) ఆశలు గల్లంతు కాకుండా ఉండాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో ముంబయి ఇండియన్స్ రెచ్చిపోయింది. మంగళవారం(అక్టోబర్ 5) జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్‌పై ఎనిమిది వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. రన్‌రేట్‌ను కూడా మెరుగుపరుచుకుంది. కౌల్టర్‌నైల్ (4/14), నీషమ్ (3/12), బుమ్రా (2/12) సూపర్ బౌలింగ్‌తో ప్రత్యర్థిని హడలెత్తించారు. దీంతో రాజస్థాన్ 9 వికెట్లకు 90 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఓపెనర్ ఇషాన్ కిషన్ ( 50 నాటౌట్; 25 బంతుల్లో 5×4, 3×6) చెలరేగి ఆడటం వల్ల.. ముంబయి ఈ స్వల్ప లక్ష్యాన్ని మరో 70 బంతులు మిగిలి ఉండగానే అలవోకగా ఛేదించింది. ముంబయి ఇండియన్స్(MI Vs RR 2021) ప్లే ఆఫ్స్‌కి చేరాలంటే సన్‌రైజర్స్ జట్టుతో జరిగే తమ చివరి లీగ్ మ్యాచ్‌లో తప్పనిసరిగా గెలవాలి. అంతేకాదు రాజస్థాన్ రాయల్స్.. కోల్‌కతా నైట్‌రైడర్స్‌ని ఓడించాలి. అప్పుడే ముంబయి ఇండియన్స్ ప్లే ఆఫ్స్‌కి చేరే అవకాశం ఉంటుంది. మ్యాచ్ ముగిసిన అనంతరం ముంబయి ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ, రాజస్థాన్ సారథి సంజూ శాంసన్ మాట్లాడారు.
మేం ఏం చేయాలో అప్పుడు తెలుస్తుంది: రోహిత్ శర్మ
"మేము ఈ స్థితికి వచ్చిన తర్వాత మా శక్తిమేరకు రాణించాలి. ఈ రెండు పాయింట్లు మాకు చాలా కీలకమైనవి. రాజస్థాన్‌ను 90 పరుగులకే కట్టడి చేయడం వల్ల మ్యాచ్‌ను త్వరగా ముగించే అవకాశం వచ్చింది. ఆటలో పైచేయి సాధించడం ముఖ్యం. మేము బయటకు వచ్చి స్వేచ్ఛగా బ్యాటింగ్ చేయాలి. రన్ రేట్‌ను మెరుగుపరుచుకునే అవకాశం ఉంది. ఈ మ్యాచ్‌లో మేం బాగా ఆడాం. ఇషాన్ కిషన్(ishan kishan ipl team 2021) కొన్ని మ్యాచ్‌ల తర్వాత మళ్లీ జట్టులోకి వచ్చాడు. అతడి విషయంలో రిస్క్ తీసుకుకోవడానికి సిద్ధంగా ఉన్నా. అతని సామర్థ్యం మాకు తెలుసు. అతను కొంత సమయం గడపాలని మేము కోరుకున్నాం. అతడు కూడా సరిగ్గా అదే చేశాడు. నీషమ్ దృఢమైన వ్యక్తి. జట్టు వాతావరణాన్ని సందడిగా ఉంచుతాడు. బౌలర్లందరూ కలిసికట్టుగా రాణించారు. ఈ టోర్నమెంట్‌లో ప్రతి జట్టు ఏ జట్టునైనా ఓడించగలదని భావిస్తున్నా. మేం సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో(sunrisers mumbai match) ఆడటానికి కంటే ముందే కోల్‌కతా నైట్‌రైడర్స్.. రాజస్థాన్‌తో తలపడుతుంది. ఆ మ్యాచ్ ఫలితాన్ని బట్టి మేం ఏం చేయాలో తెలుస్తుంది" అని రోహిత్ శర్మ అన్నాడు.