తెలంగాణ

telangana

ETV Bharat / sports

రోహిత్​ విశ్రాంతి తీస్కో.. ఎందుకలా కష్టపడుతున్నావ్​ - సునీల్​ గవాస్కర్ రోహిత్​ శర్మ

జూన్ నెలలో వరల్డ్​ టెస్ట్ ఛాంపియన్​షిప్ జరగనున్న నేపథ్యంలో ​ రోహిత్​ శర్మ ఐపీఎల్​ నుంచి బ్రేక్​ తీసుకోవాలని టీమ్ఇండియా మాజీ క్రికెటర్​ సునిల్​ గవాస్కర్​ అభిప్రాయపడ్డాడు. ఆ వివరాలు..

sunil gavaskar suggest rohit
sunil gavaskar suggest rohit

By

Published : Apr 26, 2023, 3:46 PM IST

ముంబయి ఇండియన్స్​ కెప్టెన్​ రోహిత్​ శర్మ ప్రస్తుత ఐపీఎల్ నుంచి విరామం తీసుకోవాలని మాజీ ఆటగాడు సునీల్​ గావస్కర్​ అభిప్రాయపడ్డాడు. ముంబయి వరుస పరాజయాల బాట పట్టడంతో రోహిత్ ఒత్తిడికి గురయ్యే అవకాశం ఉందని సన్నీ అన్నాడు. ఈ ప్రభావం రానున్న టెస్ట్​ ఛాంపియన్​షిప్​ ఫైనల్​పై పడే ప్రమాదం ఉందని తెలిపాడు.

"రోహిత్ శర్మ ఐపీఎల్​ నుంచి కాస్త బ్రేక్ తీసుకోవాలి. ప్రపంచ టెస్ట్​ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌ మ్యాచ్​ సమీపిస్తున్న తరుణంలో రోహిత్​కు బ్రేక్​ అవసరం. కెప్టెన్​గా టీమ్​ఇండియాను ముందుకు నడిపించాలంటే అతడు డబ్ల్యూటీసీ ఫైనల్​ మ్యాచ్​కు ఫ్రెష్ మైండ్‌ సెట్‌తో వెళ్లాలి. చూస్తుంటే అతడు కాస్త ఒత్తిడితో ఉన్నట్లు అనిపిస్తోంది. బహుశా డబ్ల్యూటీసీ గురించి ఆలోచిస్తున్నాడేమో. కాబట్టి హిట్​మ్యాన్ బ్రేక్ తీసుకోవడం ఉత్తమం" అని సన్నీ అన్నాడు.

ఐపీఎల్​లో ఇప్పటికే సగం మ్యాచ్​లు పూర్తయ్యాయి. అన్ని జట్లు ప్లేఆఫ్ అవకాశాలను అంచనా వేసుకుంటున్నాయి. అయితే ఐదుసార్లు ఛాంపియన్ ముంబయి ఆటతీరు ఈ సీజన్​లో చెప్పుకోదగ్గ రీతిలో లేదు. ఏడు మ్యాచ్​లు ఆడిన ముంబయి మూడింట్లో నెగ్గి.. నాలుగింట్లో ఓడింది. ముంబయికి ప్లేఆఫ్ అవకాశాలు సంక్లిష్టంగా మారాయి. ఈ నేపథ్యంలో రోహిత్​ ఒత్తిడి గురవుతున్నాడంటూ సన్నీ పేర్కొన్నారు. ఈ క్రమంలో ఇతర టీమ్​మేట్స్ ఎవరికైన జట్టు పగ్గాలు అప్పజెప్పి తను విశ్రాంతి తీసుకోవలసిందిగా సూచించాడు.

ముంబయి ఇండియన్స్​ బ్యాటింగ్​ పరంగా పర్వాలేదనిపిస్తున్నా.. బౌలింగ్ విషయానికి వచ్చే సరికి తేలిపోతున్నారు. ప్రత్యేకంగా డెత్​ ఓవర్లలో అనుభవంతో బౌలింగ్ చేయగల ప్లేయర్​ లేకపోవడం ఆ జట్టును మరింత కలవరపెడుతోంది. ఆఖర్లో ఆ జట్టు బౌలర్లు ధారాళంగా పరుగులు ఇచ్చేస్తున్నారు. ముంబయి చివరగా ఆడిన రెండు మ్యాచ్​ల్లోనూ ఇదే జరిగింది. గుజరాత్​ టైటాన్స్​తో గత రాత్రి జరిగిన మ్యాచ్​లో ఆఖరి ఆరు ఓవర్లలో 94 పరుగులు సమర్పింకున్నారు. ఇక పంజాబ్​తో మ్యాచ్​లో చివరి 30 బంతుల్లో 96 పరుగులు ఇచ్చుకున్నారు. ఈ గణాంకాలు ముంబయి పేలవ బౌలింగ్​ ప్రదర్శనకు అద్దం పడుతున్నాయి.

రోహిత్​కు గవాస్కర్​ సూచన..

ఎన్నో అంచనాలతో బరిలోకి దిగిన ఆర్చర్​​ సైతం ఆకట్టుకోలేక పోతున్నాడు. డెత్​ ఓవర్ల హీరో బుమ్రా గాయం కారణంగా అందుబాటులో లేడు అన్న విషయం తెలిసిందే. ముంబయి ప్లేఆఫ్స్​కు చేరాలంటే... వారు ఇకపై ఆడే మ్యాచ్​ల్లో అసాధారణ రీతిలో ఆల్​రౌండ్​ ప్రదర్శన కనబర్చాలి. మరోవైపు రోహిత్​ ఆటతీరు పట్ల అభిమానులు అసహనం వ్యక్త పరుస్తున్నారు. ఈ సీజన్​లో ఏడు ఇన్నింగ్స్​ల్లో హిట్​మ్యాన్​ కేవలం 181 పరుగులే చేశాడు. ప్రపంచకప్​ రానున్న నేపథ్యంలో.. అతడి ఫామ్​ ఇలాగే కొనసాగితే ఎలా అంటూ నెటిజన్లు సోషల్​ మీడియాలో ఫైరవుతున్నారు.

ఇవీ చదవండి:

ఐపీఎల్​లో అర్జున్ తెందూల్కర్ తొలి సిక్స్​.. ట్రోల్స్ పట్టించుకోవద్దని బ్రెట్​లీ సలహా !

IPL 2023 GT VS MI : చెలరేగిన మిల్లర్‌, అభినవ్‌.. ముంబయిపై టైటాన్స్​ ఘనవిజయం!

ABOUT THE AUTHOR

...view details